వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాక్షన్‌,ఓవరాక్షన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:భారతీయ జనతా పార్టీ జాతీయఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు కుటుంబసభ్యులు 22 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర వాణిజ్యపన్నులశాఖకుబకాయి పడిన విషయంలో కాంగ్రెస్‌ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులుకదుపుతోంది. వెంకయ్య నాయుడుకోడలు ఎం. రాధ, ఆమె తండ్రి జి.చంద్రమోహన్‌, తల్లిచంద్రకుమారి, సోదరి మాధవిపైపన్నుల ఎగవేతకు సంబంధించి సివిల్‌, క్రిమినల్‌కేసులు నమోదయ్యాయి.వెంకయ్యనాయుడు కోడలు కుటుంబసభ్యులు హీరో హోండా మోటార్‌ సైకిల్‌కుఅసోసియేట్‌ మోటార్స్‌,ఆర్‌ఎం మోటార్స్‌పేరుతో డీలర్‌షిప్‌ తీసుకున్నారు.హీరోహోండా మోటార్‌ సైకిల్స్‌కు మంచిడిమాండ్‌ ఉండడంతో వీరు కొన్ని వందలకోట్ల రూపాయల టర్నోవర్‌ చేశారు. అయినా1999 నుంచి 2005 వరకు వీరు వాణిజ్య పన్ను చెల్లింపులలో అవకతవకలకుపాల్పడ్డారు. ఆ సమయంలో రాష్ట్రంలోతెలుగుదేశం, కేంద్రంలో బిజెపి నాయకత్వంలోనిఎన్డీయే అధికారంలోఉండడంతో అధికారులు వెంకయ్య నాయుడుకుటుంబసభ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకోడానికి సాహసించలేదు.

వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు ప్రస్తుతంరాష్ట్ర సిఐడి విచారణను ఎదుర్కొంటున్నారు.నిబంధనల ప్రకారం వారు దేశంవిడిచివెళ్ళడానికి వీలు లేదు. వారి పాస్‌పోర్టులనుసస్పెండ్‌ చేయవలసిందిగా సిఐడి అధికారులుప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయానికిరాశారు. విమానాశ్రయ అధికారులకు కూడా వారిఫోటోలను పంపించి, వారు విదేశాలకు వెళ్తుంటేనిరోధించమని సూచించారు. దాదాపు ఆరేళ్ళుగా వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులు కోట్లాది రూపాయలపన్ను ఎగవేతకు పాల్పడితే,టిడిపి-ఎన్డీయే ప్రభుత్వాల పతనంతర్వాత అధికారులు మేల్కొని హడావుడిచేయడం విచిత్రం. అధికారంలో ఉన్న వారిబంధువులు ఎంత తప్ప చేసినా సివిల్‌,పోలీస్‌ అధికారులు పట్టించుకోరనడానికిఇది చక్కటి ఉదాహరణ. సినీనటిప్రత్యూష హత్య విషయంలోనూ పోలీసులుఆనాటి పాలకుల కొమ్ము కాశారు. ఇప్పుడుమొద్దు శీను విషయంలోనూ అంతే.తప్పు ఎవరు చేసినా వెంటనే చర్యలు తీసుకునేస్ధితిలో అధికార యంత్రాంగం లేదు.ప్రమోషన్లు, పోస్టింగులు, బదిలీల విషయంలో అధికారపార్టీ నాయకుల మీదఆధార పడాల్సి ఉన్నందున పోలీసులతో సహాఅన్ని శాఖల అధికారులు అధికార పార్టీ నాయకులఅడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏపార్టీ వారు తప్పు చేసినా అది తప్పే. అలాగేరాజకీయ కక్షలను తీర్చుకోడానికిఅధికారులను ప్రేరేపించడం కూడాతప్పే.

తమిళనాడులో లాగాదిగిపోయిన పార్టీల నాయకుల మీద కక్ష సాధింపుచర్యలు మన రాష్ట్రంలోతక్కువే. వె ంకయ్య నాయుడుబంధువుల పన్ను ఎగవేత కుంభకోణంమాత్రం చాలా పెద్దదిగా కన్పిస్తోంది. వెంకయ్యనాయుడికిపత్రికల్లో ఉన్న పరపతి కారణంగా దానినిసాధ్యమైన ంత వరకు బయటికిరాకుండా చూస్తున్నారు. ఒక్క విషయంలోమాత్రమే చంద్రబాబు నాయుడు,రాజశేఖరరెడ్డి ఒకటిగా వ్యవహరిస్తున్నారు.చంద్రబాబు నాయుడు వెయ్యి కోట్ల రూపాయల విలువైనప్రభుత్వ భూములను ఎమ్మార్‌ప్రాపర్టీస్‌ సంస్ధకు అతి చౌకగా కేటాయించగా, రాజశేఖరరెడ్డి ఆడీల్‌ను రద్దు చేయకుండా సమర్ధిస్తున్నారు.ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వారు ఇద్దరికీ కావలసినవారుకావడం కొసమెరుపు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X