వైఎస్‌కు ఇరిగేషన్,బాబుకు ఇరిటేషన్
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు 09-02-2006
హైదరాబాద్:ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపవర్ గ్రాఫ్ ఏవిధంగా పైకిఎగబాకుతున్నదో చంద్రబాబు నాయుడుగ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. కొన్నినీటిపారుదల ప్రాజెక్టులకు నిరసనగాతెలుగుదేశం నాయకులు చేపట్టినపాదయాత్రలకు మిశ్రమ స్పందనకనిపిస్తోంది. దీర్ఘకాలంలో ఈ పాదయాత్రలుప్రజల్లో నెగిటివ్ సిగ్నల్స్ పంపుతాయనిచంద్రబాబుకు సంబంధించిన మీడియామేధావులు అక్షరాలాహెచ్చరిస్తున్నారు. ప్రజల ఆదరణపొందడానికి ఎన్టీ రామారావు అనుసరించినవిధానాలను వైఎస్ కాపీ కొడుతూ విజయంసాధించడం చంద్రబాబు నాయుడికిమింగుడు పడడం లేదు. తాజాగాతెలుగు భాష గురించి వైఎస్ శ్రద్ధతీసుకోవడం దీనికి ఉదాహరణ. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న తొమ్మిది నెలలకాలంలో తెలుగు భాష గురించిపట్టించుకున్న పాపాన పోలేదు.
కాంగ్రెస్ హయాంలోఅవినీతి భారీ ఎత్తున జరుతున్నప్పటికీదీనిపై గట్టిగా ఉద్యమించే నైతికధైర్యం తెలుగుదేశం పార్టీకిలేకుండా పోయింది. ఈ విషయంలో గట్టిగామాట్లాడితే గతాన్ని ఎక్కడతవ్వితీస్తారోనన్న భయం టిడిపి అగ్రనాయకులకు ఉంది. చంద్రబాబు నాయుడుహయాంలో గ్రామీణాభివృద్ధినిపట్టించుకోలేదన్న విమర్శ ఉంది.చంద్రబాబుది సంపన్నులకు కొమ్ము కాసేప్రభుత్వమన్న అభిప్రాయం ప్రజల్లోవ్యాపించడంతో ఆయనకు అధికారభ్రష్టత్వం ప్రాప్తించింది.
తెలుగుదేశం పార్టీఅధినాయకుడైనా, నియంతగా పేరున్నామంత్రులను తీసుకునే విషయంలోచంద్రబాబు నాయుడు భయం భయంగావ్యవహరించేవారు. ఎవరిని కాదంటేపార్టీ ఎక్కడ బలహీనపడుతుందోననిఆయన భయపడేవారు. కాంగ్రెస్‌ముఖ్యమంత్రిగా ఎన్నో పరిమితులకు లోబడిపనిచేయాల్సిన వైఎస్ చంద్రబాబు కంటేఎక్కువ స్వేచ్ఛతో పనిచేయడం విశేషం. ఇదిపూర్తిగా వైఎస్ వ్యక్తిగత జాతకమహత్యమని జ్యోతిషులు చెబుతున్నారు.చంద్రబాబు నాయుడికి కూడా ఆశ్చర్యంకలిగిస్తున్న అంశమిది. తెలుగుదేశంపార్టీకి కాయకల్ప చికిత్స చేయకపోతే,ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయంసాధించకపోతే ఆ పార్టీ కాలగర్భంలోకలిసిపోవచ్చు.
ఇటీవలికథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
