వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాగ్యనగరిగుండెల్లో భూకంపం

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు ఒకఅడుగు ముందుకు రెండడుగులు వెనక్కి వేస్తుంటారు.రాజకీయాల విషయంలోను, పత్రికల విషయంలోను అదేజరిగింది. తెలుగుతల్లి పార్టీని ప్రకటించి ప్రారంభించకుండానేదాన్ని రద్దు చేశారు. ఉదయం దినపత్రికనుమధ్యలో మరొకరికి అమ్మేశారు. అట్లాగే బొబ్బిలిపులి వారపత్రికను కొంతకాలంనడిపి ఆపేశారు. తాజాగా నిర్మాతల మండలి నిర్ణయంవిషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో ఆయనవున్నట్లు చెప్పుతున్నారు. టివి ఛానల్స్‌లకు సినీకార్యక్రమాలుఇవ్వవద్దనే నిర్ణయాన్ని బలంగా బలపరిచినదాసరి నారాయణరావు ఇప్పుడు దాన్ని ధిక్కరించే ఆలోచన చేస్తున్నారని వినికిడి.

ఈనాడు గ్రూప్‌ను బహిష్కరిస్తేనేతాను నిర్మాతల మండలి నిర్ణయానికి కట్టుబడివుంటానని ఆయన అంటున్నారట. సినిమా అడ్వర్టయిజ్‌మెంట్లటారీఫ్‌లు తగ్గించాలనే నిర్మాతల కోరికను ఈనాడుగ్రూప్‌ అధినేత రామోజీరావు అంగీకరించకపోవడంతో ఆసమయంలో దాసరి ఆయనతో గొడవ పడ్డారు. దీంతోదాసరి సినిమా వార్తలను, కార్యక్రమాలను వేటినీ ఈనాడుగ్రూప్‌ ప్రచురించడం లేదు, ప్రసారం చేయడంలేదు. గ్రీకువీరుడు సినిమా ద్వారా దాసరి కుమారుడుఅరుణ్‌ సినిమా ఆరంగేట్రం చేస్తున్న కాలం అది. తన కుమారుడితొలి సినిమా వస్తుందనే విషయాన్ని కూడా లెక్కచేయకుండా తాను ఈనాడు గ్రూప్‌తో కలహాన్ని కొని తెచ్చుకున్నానని,అందువల్ల అందరూ ఈనాడు గ్రూప్‌ను వదిలేస్తే తప్పతాను నిర్మాతల మండలి నిర్ణయాన్ని తలదాల్చలేననిదాసరి నారాయణరావు అంటున్నారని ఆయన ఆంతరంగికులంటున్నారు. ఇటీవలఆయన రెండు సినిమాలు ప్రారంభించారు. ఆ సినిమాల ప్రారంభకార్యక్రమాలను వీడియో తీయించారు. ఈ వీడియో క్యాసెట్లనుదాసరి నారాయణరావు టివి ఛానల్స్‌కు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పుతున్నారు.దాసరి గనుక వాటిని టివి ఛానల్స్‌కు ఇచ్చేస్తే నిర్మాతలమండలి నిర్ణయం గంగలో కలుస్తుందనడంలోసందేహం లేదు.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X