'చంద్ర' బాధలు

"బాలకృష్ణను తెలుగుదేశం అధ్యక్షుడిని చేస్తున్నానని చంద్రబాబు ప్రకటించగలరా?" అని కేంద్రమంత్రి, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి సవాల్ విసిరారు. ఆ సవాలుకు ఇప్పటికీ చంద్రబాబు నుంచి జవాబు లేదు. ఇప్పుడు బాలకృష్ణ ఆ అధ్యక్షపదవిని ఆశించకపోయినా, తనదైన శైలిలో పట్టు బిగించుకుంటున్నారు. తాను సిఫార్సు చేసిన వారిలో కనీసం యాభై మందికి తెలుగుదేశం అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని బాలయ్య కోరుతున్నారు. పాతికేళ్ళుగా తెలుగుదేశంలో ఉంటూ, తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు నాయుడికి 294 నియోజకవర్గాల్లోనూ తన సొంత మనుషులు ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ మనుషులకు యాభై స్ధానాలు కేటాయించడానికి ఆయన సహజంగానే సిద్ధం లేరన్న విషయం అందరికీ తెలిసిందే.
చంద్రబాబు నాయుడు అంతర్గత సమస్యలివి. ఆయన బహిర్గత సమస్యలు ఎన్నో ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో ఇప్పుడు మూడు కులాలు మూడు రకాల పార్టీల్లో పట్టు బిగిస్తున్నాయి. కాపులు చిరంజీవి పార్టీలో, బిసీలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య సమంగా ఉన్నారు. కమ్మవారు ఈసారి తెలుగుదేశం వైపున బలంగా మోహరించి ఉన్నారు. బీసీ ఓటు బ్యాంకుని కాపాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమవుతోంది. చంద్రబాబు నాయుడు నందమూరి వారసులను దగ్గరకు తీసుకోవడం ద్వారా బిసి ఓటు బ్యాంకును కోల్పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
బీసీలను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేని నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశాలను తోసిపుచ్చలేం. చిరంజీవి పార్టీ ప్రస్తుతానికి మూడో స్ధానంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రధాన పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉంది.












Click it and Unblock the Notifications