వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఆశలు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా వెళ్తాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో హంగ్ అసెంబ్లీ ఎప్పుడూ రాలేదు. తమిళనాడు తరహాలో జనం అటో ఇటో తేల్చేయడం జరుగుతోంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి 230 స్ధానాలు దక్కించుకోగలదని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఘంటాపథంగా చెబుతున్నారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలకు చెరో పది హేను స్ధానాలకు మించి రావని ఆయన అంటున్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్ధితి ఏమిటి? ప్రభుత్వ వ్యతిరేకత ఉందా? ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఫలితాలు తారుమారు కావడం ఖాయం. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న తమకు వ్యతిరేక ఓటు ఉండదని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేశామని తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావడం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకైనా చాలా కష్టమైన విషయం. 1999 ఎన్నికల్లో చంంద్రబాబు నాయుడు రెండోసారి అధికారంలోకీ వచ్చి రికార్డు సృష్టించారు.

చంద్రబాబు నాయుడు లెఫ్ట్ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం పెద్ద పరిణామం. కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు మాత్రం పొత్తు లేకపోయినా తాము ప్రధమ స్ధానంలో ఉన్నట్టు ప్రకటించుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల అనంతర పరిస్ధితిని అంచనా వేసుకోవాలి. చిరంజీవి పార్టీకి 25 నుంచి 40 స్ధానాలు వచ్చే అవకాశముందని వివిధ సర్వేల సారాశం. ఆ స్ధానాలతో అయినా చిరంజీవి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. టీఆర్ ఎస్ కు కూడా పొత్తులతో నిమిత్తం లేకుండా దాదాపు 30 నుంచి 40 స్ధానాలు రావచ్చు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెరొక వంద స్ధానాలు వస్తే చిరంజీవి పార్టీ పాత్ర కీలకమౌతుంది. చిరంజీవి పార్టీ కాంగ్రెస్ కు కాకుండా వామపక్షాల మద్దతు ఉన్న తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తదుపరి ప్రభుత్వం తమదేనని టిడిపి నాయకుల అంచనా. చూడాలి రాజు ఎవరో, రెడ్డి ఎవరో, సారీ చౌదరి ఎవరో, రెడ్డి ఎవరో (కొత్త సామెత).

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X