చిరంజీవి పార్టీ స్పీడ్brచిరు పార్టీ ఇప్పుడు మెగా స్పీడ్ లో పయనిస్తోంది. ఈ సంచలనం....

చిరంజీవి గురించి జ్యోతిషులు, రాజకీయ పరిశీలకులు ఎన్ని విశ్లేషణలు చేసినా చిరంజీవి ప్లస్ పాయింట్స్ చిరంజీవికి ఉన్నాయి. అవి:
1. ఎన్టీఆర్ లా రాజకీయాల్లోకి వచ్చే ముందు క్లీన్ ఇమేజ్
2. మహిళల్లో, యువతలో మంచి ఫాలోయింగ్
3. అవినీతి రహిత ప్రభుత్వాన్ని చిరంజీవే స్ధాపించగలరన్న విశ్వాసం
4. ఎన్టీఆర్ కంటే మంచి ఎమోషనల్ కమ్యూనికేటర్ కావడం, గొంతును భాషకు, భావానికి అనుగుణంగా మార్చుకోగలగడం
5. జనసంఖ్యలో పెద్ద పీటలో ఉన్న కాపు, దాని ఉప కులాలకు చెందిన వాడు కావడం
6. తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడూ రెండు అగ్రవర్ణాలకు చెందినవి కావడంతో ఆ వర్ణాలకు వ్యతిరేకంగా ఉండే వర్గాలు చిరంజీవికి ఆతో మేటిక్ గా మద్దతు పలకడం
చిరంజీవి మైనస్ పాయింట్స్:
1. సినిమా రంగంలో అనూహ్య విజయంతో గర్వం తలకెక్కడం, ఒక నలుగురిని తప్ప అందరినీ దూరంగా ఉంచడం.
2. తన పార్టీలో కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్న అభిప్రాయం వచ్చేలా ఈ పది నెలల నుంచి వ్యవహరించడం.
3. భయం లేకుండా ప్రజల మధ్య సంచరించే ధైర్యం లేకపోవడం
4. ఇతర వెనుక బడిన కులాలను రాజకీయంగా తనవైపు తిప్పుకోగల శక్తియుక్తులు లోపించడం.
5. ఇతర పార్టీల్లో పెద్ద ఆదరణ లేక వస్తున్న అవినీతిపరులైన నాయకులను పార్టీలోకి తీసుకోవడం
6. రాష్ట్ర సామాజిక నేపధ్యం గురించి అవగాహన ఉన్న సలహాదారులను పెట్టుకోకుండా సినిమా ఫక్కీలో నిర్ణయాలు తీసుకోవడం.












Click it and Unblock the Notifications