చిరుకు ఆ పత్రికల మెగా మద్దతు!brఆ రెండు పెద్ద పత్రికల మద్దతు లభించడం చిరంజీవి పార్టీకి బోనసే....

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితమైన ఆ రెండు పత్రికల యాజమాన్యాలు వైఎస్ మీద ఉన్న కోపంతో ( ఆ రెండు పత్రికలను వైఎస్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిన విషయం తెలిసిందే) ఇప్పుడు చిరంజీవి పార్టీకి బ్రహ్మరథం పడుతున్నాయి. క్రమంగా చిరంజీవి పార్టీకి, చంద్రబాబు నాయుడి పార్టీకి మధ్య పొత్తులు కుదర్చడం ఈ రెండు పత్రికల అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది.
చిరంజీవి పార్టీ అంటే ఈ రెండు పత్రికల యాజమాన్యాలకు ఇష్టం లేనప్పటికీ వైఎస్ ను ఇబ్బంది పెట్టాలంటే తాత్కాలికంగా చిరు పార్టీకి మెగా మద్దతు ఇవ్వకతప్పదని ఆ యాజమాన్యాలు గ్రహించినట్టుంది. కులాలు, సామాజిక వర్గీకరణల నేపధ్యంలో చిరంజీవికి ఆ రెండు పత్రికల మద్దతు లభించడం అనుకోని అదృష్టమేనని చెప్పాలి. తిరుపతిలో బహిరంగ సభ జరుగనున్న 26 లోపు చిరంజీవి పార్టీలోకి తెలుగుదేశం నుంచే కాక, కాంగ్రెస్, టీఅర్ ఎస్ నుంచి భారీగా వలసలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
