బాబు వద్ద బాలకృష్ణ బందీ?

బాలకృష్ణకు రాయలసీమలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక సినిమా షూటింగ్ కోసమ్ కడప జిల్లాకు వెళ్ళిన బాలకృష్ణకు అక్కడ అభిమానుల తాకిడి ఎదురైంది. ఆ జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా సాధ్యం కాకపోవడంతో ఆయన షూటింగ్ ను రద్దు చేసుకుని హైదరాబాద్ కు తిరిగి రావలసి వచ్చింది. బాలయ్యకు రాయలసీమలో ఉన్న ఇంత అభిమానాని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు బాలయ్యతో వైఎస్ ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు.
వైఎస్ జగన్ బాలకృష్ణ అభిమాని అన్న విషయం చాలా మందికి తెలుసు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల నేపధ్యంలో జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అయిన తన తండ్రికి చెప్పి ఆయనను రక్షించినట్టు వార్తలు వచ్చాయి. కడప లోక్ సభ నియోజకవర్గంలో బాలకృష్ణతో ప్రచారం చేయించి అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రచారం చేయనున్న వైఎస్ జగన్ ను ఓడించాలన్నది చంద్రబాబు నాయుడు స్కెచ్. కానీ అందుకు బాలకృష్ణ సిద్ధంగా లేనట్టు అంతర్గత వర్గాల సమాచారం. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తాను కానీ కడప, పులివెందుల మీద దృష్టి కేంద్రీకరించలేనని బాలకృష్ణ చంద్రబాబు నాయుడికి చెప్పినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications
