వర్మ పై ఓ కుళ్ళు జోక్

Ram Gopal Varma
ఇల్లు కాలి అంతాఏడుస్తూంటే...చుట్ట అంటించుకోవాలి అగ్గి కావాలన్నాడుట వెనుకటి కొకడు. అట్లానే రామ్ గోపాల్ వర్మ కు ముంబయి ప్రేలుళ్ళపై స్పందిచారు. రితీష్ దేశ్ ముఖ్ తో సినిమా తీయాలంటూ తాజ్ శిధిలాలను చూడ్డానికి వెళ్ళాడు. దాంతో ఆయన పై ఇప్పుడు మహారాష్ట్రలో ఓ ఎస్.ఎమ్ .ఎస్ జోక్ ఒకటి స్పీడుగా పాపులర్ అవుతూ వస్తోంది. విలాసరావ్ దేశ్ ముఖ్ తో కలసి తాజ్ ని సందర్శించటం ఆ తర్వాత ఆయన సీ.ఎం పదవికి రాజీనామా చేయటాన్ని బేస్ చేసుకుని ఆ జోక్ తయారు చేసారు.

ఆ జోక్ లో రామ్ గోపాల్ వర్మ సాధించింది ఏమిటంటే రెండు సర్కార్ లు (సర్కార్,సర్కార్ రాజ్) తీయటం,ఓ సర్కార్ (మహా రాష్ట్ర ప్రభుత్వాన్ని)ని కూలగొట్టడం అని ఉంది. టెర్రర్ టూరిజం పేరిట ఈ ఎస్.ఎమ్.ఎస్ ని పంపుకుంటూ వారు నవ్వుకుంటున్నారు.అది వారి భాధను కక్కే మార్గంగా భావించుకుంటున్నారు. ఒకప్పుడు రంగీళా వంటి సూపర్ హిట్ ఇచ్చినప్పుడు అదే జనం మెచ్చుకున్నారు.ఆయన చేత వర్మ కార్పోరేషన్ అంటూ ఫిల్మ్ ఫ్యాక్టరీ పెట్టించి భుజాన ఎత్తుకున్నారు. అలాగే రోమ్ నగరం తగలపడుతుంటే ఆ చక్రవర్తి పియోనో వాయించుకుంటూ ఎంజాయ్ చేసినట్లు వర్మ బిహేవ్ చేయటాన్ని జోక్ లుగా మార్చి విమర్శిస్తున్నారు.

మరో ప్రక్క వర్మని బాలీవుడ్ బహిరంగంగా విమర్శిస్తోంది. ఆయన ఎంత గొప్ప డైరక్టర్ అయితేనేం సామాన్యుల మనోభావాల మీద ప్లే చేయటమేమిటని అంతా దుమ్మెత్తి పోస్తున్నారు. ఏది తప్పు...ఏది ఒప్పు అనే దాని కన్నా రాము ఒక మానవత్వం ఉన్న మనిషిలా ...తనని అంత స్ధాయికి తీసుకెళ్ళిన ముంబయి ప్రేలుళ్ళలకు సానుభూతిగా స్పందించి ఉంటే ఇలా అందరి చేతా చెప్పించుకునే వాడు కాదు. అందుకే మేధావితనం కన్నా మానవత్వం గొప్పదంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+