ప్రేమ - ద్వేషం

తనను ప్రేమించాలని ఆరు నెలలుగా తన వెంట పడుతున్నాడని, తాను ఇష్టం లేదని చెప్పినా అతను వినలేదని ఆమె చెప్పింది. దేవుడున్నాడు, నాకు న్యాయం జరుగుతుందని ఆమె అంటోంది. దసరా రెండు రోజుల ముందు శ్రీనివాస్ తన డాడీ దేవేందర్ బైకును తగులబెట్టి ఇంటి ముందు నిమ్మకాయలు పెట్టాడని ఆమె చెప్పింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా అతను దర్జాగా బయటకు వచ్చాడని ఆమె చెప్పింది. శ్రీనివాస్ తన తమ్ముడ్ని చంపుతానని బెదిరించాడని, తనకు కొరియర్ ద్వారా రెండు తెల్ల కాగితాలు పంపాడని ఆమె చెప్పింది.
పోలీసులు ముందే చర్యలు తీసుకుని ఉంటే అతను ఈ దారుణానికి పాల్పడి ఉండేవాడు కాదని ఆమె అంటోంది. శ్రీనివాస్ కు భయపడి కొన్నాళ్లు కాలేజీకి కూడా మానేశానని, ఫైనలియర్ కావడంతో వెళ్లాల్సి వచ్చిందని, దీన్నిగమనించి తనను వెంటాడి యాసిడ్ దాడి చేశాడని ఆమె చెప్పింది. శ్రీనివాస్ వెంటపడుతున్న విషయంపై తన తల్లిదండ్రులు శ్రీనివాస్ తండ్రిని పిలిపించి చెప్పారని, ఆయన సారీ చెప్పాడని, తన కొడుకును అదుపులో పెట్టుకుంటానని చెప్పాడని ఆమె చెప్పింది. అయినా శ్రీనివాస్ మారకపోగా మరింత పగ పెంచుకున్నాడని ఆమె అన్నది. స్వప్నికపై దాడిని నిరసిస్తూ వరంగల్లో నిరసన పెల్లుబుకింది.












Click it and Unblock the Notifications