టిడిపి, టీఅర్ ఎస్ కలిస్తే....

చిరంజీవి, చంద్రబాబు నాయుడు కలిసి చెరొక రెండున్నరేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉండాలని సిపీఐ నాయకుడు నారాయణ అభిభాషించారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాగానే నారాయణ కూడా ఈసారి వైఎస్ ను మళ్ళీ సిఎంగా చూడదలచుకోలేదేమో. చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు తెలంగాణలో చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ చిరంజీవి పార్టీ పొత్తుల విషయంలో ఇంకా ఆచితూచి వ్యవహరిస్తోంది. చంద్రశేఖరరావుకు ఏదో ఒక పెద్ద పార్టీ అండ ఉండాల్సిందే. బిజెపి హవా ఏమాత్రం లేని ఈ దశలో, కాంగ్రెస్ తో ససేమిరా అనుకున్న స్ధితిలో ఆయనకు తెలుగుదేశం, ప్రజారాజ్యంలలో ఏదో ఒక పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం ఏర్పడింది.
రాజకీయ చతురత, మాటకారితనం గల చంద్రశేఖరరావు తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్ మినహా ఏ పడవ ఎక్కడానికైనా సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ తో పొత్తుకు ఇప్పటికైనా అవకాశాలు ఉన్నాయి కానీ దాదాపు నాలుగేళ్ళు ఊరించి తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోని కాంగ్రెస్ అంటే హార్డ్ కోర్ తెలంగాణ వాదుల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. కాబట్టి చంద్రశేఖరరావు ఎట్టి పరిస్ధితుల్లోనూ కాంగ్రెస్ తో పొత్తు కలవడానికి సిద్ధపడరు. చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడితో కలిసినా తెలంగాణలో ఆ కూటమికి గణనీయంగా సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో కోల్పోయే సీట్లను కాంగ్రెస్ ఎక్కడ పూడ్చుకుంటుందన్నది ఈనాటి ప్రశ్న.












Click it and Unblock the Notifications