చంద్రుడికి చుక్కలు!

ఈ విధంగా వైఎస్ చంద్రబాబును అష్ట దిగ్బంధనం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబును ఆయన తోటకూరలో పురుగులాగా తీసి పారేస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో నిన్న ఆయనను ఒక ఐపిఎస్ అధికారి అవమానించారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని తెలుగుదేశం నాయకులు అనుమానిస్తున్నారు. చంద్రబాబు వైఎస్ అవినీతి పై ఎందుకు దూకుడూగా వ్యవహరించలేకపోతున్నారన్న అనుమానం ఆ పార్టీ శ్రేణులను వేధిస్తోంది.
దేవేందర్ గౌడ్ వంటి వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉండదని తలసాని శ్రీనివాస యాదవ్ అలిగి కూర్చున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గౌడ్ వల్ల ఉపయోగముంటుందని చంద్రబాబు ఆశపడుతున్నారు. కానీ డ్రాయర్ల లాగా పార్టీలను మార్చే వారితో ఉపయోగం ఎంత ఉంటుందన్నది ప్రశ్న. మరో వైపు చిరంజీవి కాంగ్రెస్ కు అనుకూలంగా, చంద్రబాబు నాయుడంటే ఆగ్రహంగా ఉంటున్నట్టు కన్పిస్తోంది. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ప్రజారాజ్యం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఆ కూటమికి ఓట్ల పంట పండడం ఖాయం. కానీ బహిరంగంగా కాకుండా లోపాయికారీగా ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరే అవకాశముంది. ఇక లోక్ సత్తాకు ఒంటరి పోరు తప్పదు. గ్రేటర్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పరాజయం చవిచూస్తే మరికొంత మంది నాయకులు చంద్రబాబు నాయుడి మీద తిరుగుబాటు చేయవచ్చు.












Click it and Unblock the Notifications