'సిఎం చిరంజీవే'

నిన్న తన జన్మదినాన్ని తిరుమలలో కుటుంబసభ్యులతో జరుపుకున్న సందర్భంగా ఆమె ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. 1983లో ఎన్టీఆర్ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు దేవుడే దిగి వచ్చాడని అనుకున్నారని, ఇప్పుడు చిరంజీవి వచ్చినప్పుడు కొంచెం మార్పు ఉన్నా, చిరంజీవిలో గొప్ప మానవతావాదిని ప్రజలు చూస్తున్నారని, ఈ ఎన్నికల తర్వాత చిరంజీవి ముఖ్యమంత్రి కావచ్చని ఆమె అన్నారు. ఈసారికి ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తున్నానని, ఐదేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచే నిలబడతానని ఆమె చెప్పారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి, ములాయం సింగ్ సమాజ్ వాది పార్టీకి చాలా పోలికలు ఉన్నాయని, ఇద్దరూ బడుగు బలహీన వర్గాల పక్షపాతులేనని, రెండు పార్టీల ఎన్నికల గుర్తు సైకిలేనని ఆమె అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించినప్పుడు ఎన్టీఆర్ వైపు ఉండకుండా చంద్రబాబు నాయుడు వైపు ఎందుకు దూకారని ఆ ఆంగ్ల పత్రిక విలేకరి అడగలేదు, ఆమె చెప్పలేదు. ఇదీ సంగతి.












Click it and Unblock the Notifications