ఎన్నికల తర్వాత చిరుదే మెగాపాత్ర!

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి 'ప్రజారాజ్యం'కు తెలుగుదేశం నాయకత్వంలోని మహాకూటమికి రోజు రోజుకూ అంతరం పెరుగుతోంది. వామపక్షాల మీద పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు సంచలనం కలిగిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు తమ మీద విమర్శ చేసే నైతిక హక్కు లేదని వామపక్షాల నాయకులు అన్నారు. పవన్ తన మొదటి భార్యకు ఐదు కోట్ల రూపాయల భరణం ఇచ్చుకుని విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తాను కలిసి ఉంటున్న రేణూదేశాయ్ ని అధికారికంగా పెళ్ళి చేసుకున్నారు. ఈ విధంగా తన మీద రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా విమర్శలు చేయకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కమ్యూనిస్టుల మీద విమర్శలు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు వామపక్ష పార్టీల్లో గుబులు కలిగిస్తున్నాయి. మహాకూటమికి వంద కంటే తక్కువ స్దానాలు వస్తే కాంగ్రెస్ ప్లస్ ప్రజారాజ్యం కలిసి ప్రభుత్వాన్ని స్ధాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ అంటే తీవ్ర వ్యతిరేకత ఉన్న చిరు ప్రజారాజ్యం ఇప్పుడు మహా కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఎన్నికల తర్వాత మద్ద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కమ్యూనిస్టులకు అంత వ్యతిరేకంగా మాట్లాడడం అందుకు సంకేతంగా భావించవచ్చు. కాంగ్రెస్ కు వంద నుంచి నూట పదిహేను స్ధానాలు వస్తాయనుకుంటే చిరు పార్టీ తెచ్చుకునే 20 నుంచి 40 స్ధానాలు కలిస్తే మహా కూటమి మటాష్ అయినట్టే.

మొత్తమ్మీద సామాజికంగా మిత్రులు మళ్ళీ మిత్రులు కాబోతున్నారు. సహజ శత్రువులు శత్రువులు కాబోతున్నారు. కమ్మ- కాపు శత్రుత్వం ఈసారి మళ్ళీ కనిపిస్తున్నది. రాజశేఖరరెడ్డి కమ్మ వారికి వ్యతిరేకంగా ఏన్నో ఏళ్ళ నుంచి కాపులను పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం కాంగ్రెస్, ప్రజారాజ్యం కలిస్తే మహాకూటమి మటాష్ అయిపోవడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+