రోశయ్య నక్కను తొకినట్టేనా?

రాష్ట్రానికి చెందిన జిఎం ఆర్ గ్రూపు వైశ్యులకు చెందినది. రోశయ్య కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు. ఇన్ ఫ్రా రంగంలో దేశంలోనే అగ్ర స్ధానంలో ఉన్న ఈ గ్రూపునకు మంచి గుడ్ విల్ ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ గ్రూపునకు ఏ నష్టం ఉండదు. అయినా వారికి రోశయ్య అంటే ప్రత్యేక అభిమానం ఉండడంలో వింత లేదు. వ్యాపార వర్గానికి చెందిన మున్నూరు కాపులు కూడా రోశయ్యకు మద్దతు ఇస్తున్నట్టు కన్పిస్తోంది. ఈ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కేశవరావు, వి హన్మంతరావు జగన్ ను బహిరంగంగా వ్యతిరేకిస్తూ, రోశయ్యను సమర్ధిస్తున్నారు.
ముఖ్యమంత్రి రోశయ్యను మార్చే ప్రసక్తి లేదని అధిష్ఠానం మంగళవారం సంకేతాలు ఇచ్చింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానికంటే సీఎల్పీ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలన్న విషయంలోనే అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో మంగళవారం నాటి పరిణామాలను పార్టీ సీనియర్ నేత ప్రణబ్‌ముఖర్జీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిలకు రాత్రి 9-10 గంటల మధ్య ప్రాంతం లో ముఖ్యమంత్రి కె.రోశయ్య ఫోన్‌లో వివరించినట్లు తెలిసింది.
అధిష్ఠానం కూడా తమ అభిప్రాయాలను రోశయ్యకు తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా..తాము తదుపరి సీఎల్పీ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలన్న అంశంపైనే ఆలోచిస్తున్నామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. కొత్త సీఎం ఎంపికపై తాము దృష్టిపెట్టడం లేదని వారు చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications