నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ప్రకటనతో ప్రకంపనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రకటనతో కాంగ్రెసు పార్టీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు ఓదార్పు యాత్ర ముగింపు సభలో జగన్ చేసిన ప్రకటన కాంగ్రెసు పార్టీలోని పలువురికి ఆగ్రహాన్ని తెప్పించింది. తాను సహనం కోల్పోతే ఉప్పెన పుడుతుందని ఆయన చేసిన హెచ్చరికను కాంగ్రెసు నాయకులు తీవ్రంగానే తీసుకుంటున్నారు. పి. శంకరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి నాయకులు జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ పరిధిలో పనిచేస్తే జగన్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని సలహాలు ఇస్తున్నారు. అయితే, వారి సలహాలను పాటించే స్థితిలో జగన్ లేరు. తన మార్గమేదో తాను నడవదలుచుకున్నట్లే కనిపిస్తున్నారు. ఒక రకంగా ఆయన తన అనుచరుల చేతుల్లో బందీ అయ్యారని చెప్పవచ్చు. వారు చెప్పినట్లు ఆయన వినాల్సిందే గానీ తాను చెప్పినట్లు వారు వినే స్థితి కూడా దాటిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి.

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 63 రోజుల పాటు ఓదార్పు యాత్ర చేసిన జగన్ నెల్లూరు సభలో తన రాజకీయాలకు ట్విస్టు ఇచ్చారు. అధిష్టానం మాటను వినాల్సిన అవసరం లేదని మరోసారి చాటి చెప్పారు. అధిష్టానం తన దారికి వచ్చి తనను అందలం ఎక్కించాల్సిందేననే పద్ధతిలో మాట్లాడారు. ఆయన తీరుపై కాంగ్రెసు పార్టీవారే కాకుండా తెలుగుదేశం పార్టీ వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని ఆయన ఒక్క మాట అనకున్నా తెలుగుదేశం నాయకులు ఉలిక్కిపడడానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైయస్ జగన్ తో చేతులు కలిపి ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం క్యాడర్ కూడా జగన్ వైపు వెళ్లే పరిస్థితి ఉంది. దీంతో క్యాడర్ ను కాపాడుకోవడానికి నెల్లూరు జిల్లా తెలుగుదేశం నాయకులు తంటాలు పడుతున్నారు.

వైయస్ జగన్ తీరుపై పార్టీ అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎఐసిసి సదస్సుకు డుమ్మా కొట్టి, ఓదార్పు యాత్ర చేయడమే కాకుండా, చివరలో వాగ్బాణాలు సంధించడాన్ని పార్టీ అధిష్టానం పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదనే విషయాన్ని వారు చెప్పదలుచుకున్నట్లు సమాచారం. ఈ స్థితిలో జగన్ పై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X