జగన్ కే కాదు, కెసిఆర్ కూ చెక్

K Chandrasekhar Rao-YS Jagan
తమను ధిక్కరిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కూడా చెక్ పెట్టగలిగే దీటైన నాయకుడిని కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎంపికపై బుధవారం మధ్యాహ్నానికే పూర్తయిందని ఎఐసిసి కార్యదర్శి జనార్దన్ ద్వివేది చెప్పారు. ముఖ్యమంత్రి రెడ్లకే దక్కుతుందని కూడా ఎఐసిసి వర్గాలంటున్నాయి. ఈ స్థితిలో అటు వైయస్ జగన్ ను, ఇటు కెసిఆర్ ను కట్టడి చేయడానికి బలమైన నేత ముఖ్యమంత్రిగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దాదాపుగా ఎస్ జైపాల్ రెడ్డి పేరు ఖరారైందని చెబుతున్నారు. తెలంగాణ నేతను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా డిసెంబర్ 31వ తేదీ తర్వాత తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడం సులభమవుతుందని భావిస్తున్నారు.

ఇటీవలి తెలంగాణ ఉద్యమాలను పరిగణనలోకి తీసుకుని బలమైన నాయకుడి అవసరాన్ని అధిష్టానం గుర్తించినట్లు సమాచారం. ఎస్సై పరీక్షల వాయిదా నేపథ్యంలో సీమాంధ్రలో తలెత్తిన ఆందోళనలను రోశయ్య అణచివేయలేకపోయారనే అభిప్రాయం ఉంది. తెలంగాణ కాంగ్రెసు నాయకులు దాదాపుగా కెసిఆర్ గొంతుతో మాట్లాడుతున్నారు. జైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులను కట్టడి చేయడం సాధ్యమవుతుంది. జైపాల్ రెడ్డిని కాదని తెలంగాణ ఆందోళనలకు వారు ముందుకు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని అంటున్నారు.

ఈ స్థితిలో తెలంగాణ కాంగ్రెసు నాయకుల్లోనే కాకుండా తెరాసలోనూ, తెలంగాణ ప్రజా సంఘాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి నియామకాన్ని బట్టి తెలంగాణ పట్ల సోనియా అభిమతం కూడా బయటపడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని కెసిఆర్ అంటున్నారు. తమ ఉద్యమం వచ్చే ఏడాది జనవరి నెలాఖరున ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ స్థితిలో కెసిఆర్ తో కాంగ్రెసు తెలంగాణ నాయకులు గొంతు కలిపే పరిస్థితి లేకుండా చూసుకోవాలనేది సోనియా అభిప్రాయంగా చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకపోయినా పరిస్థితి తమ అదుపులో మాత్రమే ఉండాలని, అలా అదుపు చేసే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+