రోజాకు దారి దొరికింది

Roja
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో రాజకీయాల్లో దారి తెన్నూ లేకుండా పోయిందని భావించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ మహిళా సంఘం తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు, సినీ నటి రోజాకు దారి దొరికింది. ఆమె రాజకీయాల విషయంలో చాలా స్పష్టంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. వైయస్ మరణంతో ఆమె రాజకీయ జీవితం డోలాయమనంలో పడిందని అందరూ భావించారు. ఇదే సమయంలో రోజా రాజకీయంగా మౌనంగా ఉంటూ వచ్చారు. సినిమాల్లో నటిస్తూ, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె బిజీగా గడిపే ప్రయత్నం చేశారు. ఆమె నటించిన సినిమాలు కూడా పెద్దగా విజయం సాధించలేదు. దాంతో ఆమె రాజకీయంగా, సినీపరంగా దెబ్బ తిన్నట్లేనని భావిస్తూ వచ్చారు.

అకస్మాత్తుగా ఆమె రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకున్న తీరు బయటపడింది. రోజాను వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ముగింపు సభకు నెల్లూరు ఆహ్వానించినట్లు శనివారం వార్తలు వచ్చాయి. ఆమె నెల్లూరు బహిరంగ సభలో వైయస్ జగన్ కూ పూర్తి మద్దతు ఇస్తూ ప్రసంగించారు. తన ప్రసంగ పాటవాన్ని నెల్లూరు బహిరంగ సభలో మరోసారి ప్రదర్సించారు. జగన్ నుంచి మించిన నాయకుడు లేడంటూ ప్రశంసించారు. వైయస్ జగన్ రాజకీయ శిబిరంలో ఆమె కూడా ప్రధాన పాత్రధారి అని నెల్లూరు సభ ద్వారా తెలిసి వచ్చింది.

ఇమేజ్ ఉన్న నాయకురాలిగా వైయస్ జగన్ శిబిరంలో ఆమె ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. చాలా మంది సినీ నటుల మాదిరిగా కాకుండా రోజా రాజకీయాల్లో కూడా రాటు దేలారు. రాజకీయంగా ఆమె ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులను ఎదుర్కునే సత్తాను, వాదనపటిమను అలవరుచుకున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఆమె మద్య వ్యతిరేక ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. మహిళా సమస్యలపై ఆమె ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ వచ్చారు. పార్టీలో ఆమె ఎదుగులను ఇచ్చగించని నాయకులను ఆమెను సైడ్ లైన్ చేసేందుకు సిద్ధపడ్డారని విమర్శలు వచ్చాయి. దాని వల్లనే ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారా కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు వైయస్ జగన్ పార్టీ పెడితే ప్రధాన నాయకుల్లో ఆమె ఒకరవుతారనడంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+