జగన్ పై రోశయ్య ఫిర్యాదు?

అధికారపక్షంలోనే జగన్ వంటి నేతలు ప్రతి పక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని బాహటంగానే నిలదీస్తు న్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో ప్రవేశపెట్టిన పింఛన్లు, పావలావడ్డీ, ఫీజుల రియంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ తదితర సంక్షేమ పథకాలకు నిధులు అందక పోవడంతో సొంత పార్టీ, సొంత ప్రభుత్వం అని కూడా చూడకుండా నిలదీస్తున్నారు. సంక్షేమ పథకాలు రద్దు చేస్తే సహించేది లేదంటూ ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చ రికలు జారీ చేయడం ద్వారా ప్రజల్లో ఆదరణ పొందడా నికి జగన్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
కడప జిల్లాలో పలు చోట్ల ఇటీవల జరిగిన ప్రజాపథం సభల్లో, పార్టీకి చెందిన ఇతర కార్యక్రమాల్లో జగన్ ప్రధానంగా ప్రజాసమస్యలను ప్రస్తా వించి ప్రభుత్వ వైఖరిపై చిందులు వేశారు. కొన్ని పథకాల విష యంలో ఆయన ప్రభుత్వాన్ని నిలదీసి సంక్షేమ పథకాలకు నిలిచి పోయిన నిధులను రాబట్టుకోగలిగారు. ఆయనతో పాటు పాలకపక్షంలో మరి కొందరు నేతలు జనం పక్షాన నిలిచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. ప్రజల్లో పట్టుకోసం కుస్తీ పడుతున్నారు. అసలు సిసలైన రాజకీయ నేతలుగా, ప్రజా గుర్తింపు పొందడానికి కొంతమంది నేతలు ప్రతిపక్షనేతల తరహాలో వ్యవహరిస్తుం డటం పాలకపక్షానికి సంకటంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచే నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications