జగన్ కోసమే రాష్ట్ర విభజన?

అయితే, ఆ ప్రచారాన్ని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు కొట్టిపారేస్తున్నారు. జగన్ ను, చంద్రబాబును ఎదుర్కోవడానికి తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన శుక్రవారం ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కాగా, తెలంగాణ ఇవ్వడానికి తమ కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. యుపిఎ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని ఆయన అన్నారు. తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో కూడా కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై పనిచేసే ఎవరితోనైనా తాము కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదని అంటున్నారు.
వైయస్ జగన్ ను పార్టీ అనుమతి లేని కార్యక్రమంగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కొట్టిపారేస్తూ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నవారిపై, ఓదార్పు యాత్రలో పాల్గొంటున్నవారిపై చర్యలకు దిగారు. కానీ, తెలంగాణ నేతల కార్యక్రమాలను మాత్రం అనుమతిస్తున్నారు. కరీంనగర్ లో ఇటీవల జరిగిన తెలంగాణ త్యాగధనుల సంస్మరణ సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులతో పాటు సీనియర్ నాయకులందరూ పాల్గొన్నారు. ఈ సభలను తెలంగాణవ్యాప్తంగా నిర్వహించడానికి తెలంగాణ కాంగ్రెసు నాయకులు పూనుకున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం నోరు మెదపడం లేదు. అయితే, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఆంద్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అనుమతి ఉందని తెలంగాణ నాయకులు చెబుతున్నారు. వైయస్ జగన్ ను, చంద్రబాబును దెబ్బ తీయడానికే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూనుకుంటుందా అనే విషయంపై కూడా ప్రస్తుతం పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications