విజయశాంతికి ముందు గొయ్యి, వెనుక నుయ్యి

Vijayashanthi
హైదరాబాద్: ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది ఇప్పుడు విజయశాంతి పరిస్ధితి. రాజీనామాను స్పీకర్ ఆమోదించుకునేలా పట్టుబట్టాలని మొదట ఆమె అనుకున్నా ఇప్పుడు తటపటాయిస్తున్నట్టు కనిపిస్తోంది. రాజీనామా ఆమోదించిన తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లో టిఆర్ ఎస్ అధినేత కెసీఅర్ మళ్ళీ టికెట్ ఇస్తారో లేదోనన్న భయం ఆమెకు పట్టుకున్నట్టు కనిపిస్తోంది. పోనీ ఎంపీగా కొనసాగుదామంటే తెలంగాణ ద్రోహి అన్న ముద్ర పడుతుంది.

కెసిఆర్ కు ఆమెకు చాలా నెలలపాటు మాటలు లేవు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆమె తనను ఖాతరు చేయకుండా స్వతంత్రంగా వ్యవరిస్తోందన్న గుర్రు కెసిఆర్ కు ఉంది. తనను తీవ్రంగా విమర్శించే కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తనకు చెప్పకుండా విజయశాంతి పర్యటించడం ఆయనకు ఆగ్రహం కలిగించింది. ఆ విషయంపై ఆయన ఆమెను బాహాటంగానే మందలించారు. తనను పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదని విజయశాంతి పత్రికాముఖంగా ఆరోపించారు.

కెసిఆర్ నిరాహార్ దీక్ష సమయంలో సీన్ మారిపోయింది. ఆ సమయంలో కూడా తాను ఆయనకు మద్దతుగా ఉండకపోతే తన నియోజకవర్గ ప్రజలు ఆగ్రహిస్తారన్న భయంతో విజయశాంతి సినిమాఫక్కీలో ఆయనతో కలిశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు లేవు. కానీ టిఆర్ ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాల తర్వాత మళ్ళీ సీన్ మారుతున్నట్టు కన్పిస్తోంది. అనవసరంగా రాజీనామాలు చేసి అసెంబ్లీలో వాణి విన్పించకుండా చేసుకున్నామన్న బాద కొందరిలో కన్పిస్తోంది. అటువంటి వారు విజయశాంతితో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డికి కూడా కెసిఆర్ తో సత్ సంబంధాలు లేవు. ఈసారి తనకు టీఅర్ ఎస్ టికెట్ రాదేమోనన్న భయం ఆయనకూ పట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+