కెవిపి రామచందర్ రావు ఎటు వైపు?

ఆ తర్వాత ఇటు ముఖ్యమంత్రి రోశయ్యకు, అటు జగన్ కు అండదండలు అందిస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. రెండు పడవల ప్రయాణాన్ని మానుకోవాలని అధిష్టానం కెవిపిని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ స్థితిలో జగన్ కు నచ్చజెప్పడానికి కెవిపి తీవ్రంగానే ప్రయత్నాలు చేసినట్లు చెబుతారు. కానీ జగన్ కెవిపి మాటను వినే స్థితిలో లేరని అంటున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడానికి ఒక రకంగా కెవిపియే కారణమనే ఆసంతృప్తి కూడా జగన్ వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.
వదలమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అనే తీవ్ర ఇరకాటంలో కెవిపి పడ్డారని అంటారు. అధిష్టానం మాట వింటేనే భవిష్యత్తు ఉంటుందని కెవిపి భావిస్తున్నట్లు సమాచారం. అధిష్టానాన్ని ధిక్కరిస్తే రాజకీయ భవిష్యత్తు సందిగ్దంలో పడడమే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతాయని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెవిపిని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాల వారు మాత్రమే కాకుండా స్వపక్షంవారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కెవిపి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కెవిపిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ భేతాళ మాంత్రికుడిగా అభివర్ణించారు. వైయస్ హయాంలో జరిగిన అన్ని లావాదేవీలను ప్రతిపక్షాల నాయకులు, స్వపక్షం నాయకులు తిరగదోడుతున్నారు. ఆ లావాదేవీలన్నింటిలో కెవిపి పాత్ర ఏదో మేరకు ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే.
తాజా పరిణామాలను ఆకళింపు చేసుకుని, భవిష్యత్తును అంచనా వేసిన కెవిపి జగన్ కు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. జగన్ కార్యకలాపాల పట్ల మౌనంగా ఉండాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అధిష్టానానికి విధేయత ప్రదర్సించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. అందుకే ఆయన తన పనేదో తాను చేసుకు పోతూ అన్నింటికీ దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications