వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014 ఎన్నికలలో బాలయ్య పోటీ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
ఇటీవల నందమూరి బాలకృష్ణ అమెరికా పర్యటన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయ ఆరంగేట్రంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇటీవల బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం నిధులు సేకరించడానికి బాలయ్య అమెరికా రాష్ట్రాలలోని తెలుగు వారు అధికంగా ఉండే నగరాలలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాను త్వరలో రాజకీయాలలోకి వస్తానని, అయితే తాను రాజకీయాలలోకి వచ్చినప్పటికీ బావ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని ప్రకటించిన విషయం తెలిసిందే. బాలయ్య అలా అమెరికాలో రాజకీయ ఆరంగేట్ర ప్రకటన చేశారో లేదో రాష్ట్రంలో బాలయ్య ఎంట్రీపై చర్చలు ప్రారంభమయ్యాయి. శనివారం రోజు గుంటూరు జిల్లాలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాల్ కృష్ణ సైతం బాలయ్య రాజకీయాల్లోకి వస్తే బాగా రాణిస్తారని చెప్పారు. బాలకృష్ణ స్వయంగా తాను త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పడంతో ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తాడనే ప్రశ్నలు సైతం ఆయన అభిమానులతో పాటు పలువురిని వేధిస్తన్నాయి.

తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా పెట్టని కోట. అది దివంగత ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో అక్కడ నందమూరి కుటుంబానికి మంచి పట్టు ఉంది. హిందూపురం కూడా టిడిపికి పెట్టని కోటనే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి హిందూపురంలో విజయకేతనం ఎగుర వేస్తోంది. ఎన్టీఆర్ సైతం హిందూపురం నుండి పోటీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నుండి ఎన్టీఆర్ ఓసారి పోటీ చేశారు. తెలంగాణ అంశం, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కల్వకుర్తి నుండి బాలయ్య పోటీ చేసే అవకాశం లేదు. ఇక తన సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల చిత్తురు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కుమార్‌ను ఇంచార్జిగా నియమించేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోటీగా కృష్ణా జిల్లాలోని ఓ నియోజకవర్గానికి జూనియర్ ఎన్టీఆర్‌ను హరికృష్ణ తెరపైకి తీసుకు వచ్చారు. దీంతో నందమూరి - నారా కుటుంబాల మధ్య విభేదాలు తెరపై ప్రస్ఫుటంగా కనిపించాయి.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాలు పొడసూపకుండా ఉండేందుకు బాలయ్య సొంత జిల్లా నుండే బరిలోకి దిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అంతేకాదు ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు సైతం బాలకృష్ణ బావ బాబుకు మద్దతుగా ఉన్నట్లుగానే కనిపించారు. అయితే బాలయ్య ఎక్కడ పోటీ చేసినా ఆయన ప్రభావం సొంత జిల్లాలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కృష్ణా జిల్లాలో కాకుండా ఆయనకు ఇష్టం ఉన్న మరే నియోజకవర్గం నుండి చేసినప్పటికీ కృష్ణా జిల్లా బాలయ్యతో ఉండే ఆస్కారం ఉంటుందని కాబట్టి ఆయన హిందూపురం నుండి పోటీ చేయడానికి సైతం మొగ్గు చూపవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలా కాకుండా కృష్ణా జిల్లాతో పాటు హిందూపురం నుండి రెండు నియోజకవర్గాలలోనూ పోటీ చేయవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది చూచాయగా తెలిసినప్పటికీ ఖచ్చితంగా తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే.

English summary
The political analysts saying that Balakrishna will contest from Krishna district or Hindupur in 2014 election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X