వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాసరిపై చిరంజీవి ఎఫెక్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ప్రాబల్యం కాంగ్రెసులో తగ్గిపోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవే కారణమని అంటున్నారు. కాపుల ఓట్లను, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమ వైపు స్థిరపరుచుకోవడానికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం దాసరి నారాయణ రావును ప్రోత్సహించింది. చిరంజీవిని తమ వైపు తిప్పుకోవడానికి కూడా ప్రయత్నించింది. అందుకే చిరంజీవి సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని అప్పట్లో వైయస్ రాజశేఖర రెడ్డి భావించారు. అయితే, కాంగ్రెసుకు తాను మద్దతిస్తాననే హామీ చిరంజీవి నుంచి లభించకపోవడంతో నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు దక్కలేదు. అదే సమయంలో దాసరి నారాయణ రావును ముందుకు తెచ్చి కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే, అకస్మాత్తుగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో దాసరి నారాయణ రావు ప్రాబల్యం క్రమంగా కాంగ్రెసు పార్టీలో తగ్గుతూ వచ్చింది.

చిరంజీవిని దగ్గరు చేసుకోవడానికి ఎన్నికల తర్వాత ప్రయత్నాలు ప్రారంభించే క్రమంలో దాసరి నారాయణ రావును మరింతగా దూరం పెడుతూ వచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయించడానికి మంతనాలు ప్రారంభించారు. వైయస్ తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ చిరంజీవితో చర్చలు జరుపుతూ వచ్చారు. చిరంజీవితో స్నేహం చేసే ప్రయత్నాలు వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తరుచుగా చెబుతూనే ఉన్నారు. అయితే, తాజాగా పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చిరంజీవిని కులుపుకోవాల్సిన అవసరంపై వైయస్ సోనియా గాంధీకి రాసిన లేఖను బయటపెట్టడంతో ఆ విషయం నిర్ధారణ అయింది.

చిరంజీవి కాంగ్రెసు పార్టీలోకి తెచ్చే క్రమంలోనే దాసరి నారాయణ రావు మంత్రి పదవి కూడా పోయిందని చెబుతున్నారు. ఒక చోట రెండు అధికార కేంద్రాలు సాధ్యం కావు కాబట్టి చిరంజీవి తీసుకు రావడానికి తప్పనిసరిగా దాసరి నారాయణ రావు ప్రాబల్యాన్ని తగ్గించాల్సిన పరిస్థితిలో కాంగ్రెసు అధిష్టానం పడింది. దానిపై తీవ్రంగా మనస్తాపానికి గురైన దాసరి నారాయణ రావు తన ఆవేదనను ఓ సభలో వ్యక్తం చేశారు కూడా. అయితే, కారణాలను, అంతర్గత విషయాలను ఆయన బయటపెట్టలేదు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తనను దూరం చేయడంతో దాసరి నారాయణ రావు ఒక రకంగా కోపంగా ఉన్నారని కూడా అంటున్నారు. అందువల్ల ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణతో పరమవీర చక్ర తీశారని చెబుతారు. దాసరి నారాయణ రావు తీసిన బెబ్బులిపులి సినిమా ఎన్టీ రామారావుకు రాజకీయాల్లో ఆధిపత్యం సాధించడానికి తోడ్పడింది. అదే స్థాయిలో బాలకృష్ణ పరమవీర చక్ర సినిమా ఉంటుందనే సంకేతాలు కూడా దాసరి ఇచ్చారు. కానీ, అది కూడా తగిన ఫలితాలు ఇవ్వలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X