వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ గుట్టు విప్పిన నారా లోకేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
శ్రీకాకుళం జిల్లా ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు వ్యవహారంపై దుమారం చెలరేగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌కు చెందిన టీవీ చానెల్ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై విరుచుకుపడింది. ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు ఇతర పవర్ ప్రాజెక్టుల గుట్టు విప్పి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని దోషిగా నిలబెట్టేందుకు ఆయన టీవీ చానెల్ స్టూడియోఎన్ ప్రయత్నించింది. ఈ మేరకు స్టూడియోఎన్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. పవర్ ప్రాజెక్టు యజమానుల్లో వైయస్ కుటుంబ సభ్యులున్నారని ఆరోపించింది. సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టుల వెనక వైయస్ కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపించింది.

ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెట్టుబడుల వ్యవహారాన్ని ఆ చానెల్ విప్పి చెప్పే ప్రయత్నం చేసింది. అథెనా అనే సంస్థకు ఎలా అనుబంధ సంస్థలు పుట్టుకొచ్చాయో స్పష్టం చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ రవీంద్రా రెడ్డి, అల్లుడు అనిల్ కుమార్‌లకు ఉన్న పెట్టుబడుల గుట్టు విప్పింది. పెట్టుబడులు పెట్టేందుకు పుట్టుకొచ్చిన సంస్థల పేర్లను కూడా తెలిపింది. అధికారాన్ని వినియోగించుకుని రాష్ట్రంలోని ఖనిజ సంపదను వైయస్ కుటుంబ సభ్యులు కొల్లగొడుతున్న వైనానికి ఇది అద్దం పడుతుందని కూడా చానెల్ వ్యాఖ్యానించింది.

పారిశ్రామిక రంగంలో ప్రగతి పథంలో సాగుతున్న మ్యాట్రిక్స్ నిమ్మగడ్డ ప్రసాద్, కార్వీ సంస్థ శివరామకృష్ణ, మరో సంస్థకు చెందిన తాతినేని వెంకటకృష్ణలను వైయస్ రాజశేఖర రెడ్డి చేరదీసి వారి ద్వారా కథంతా నడిపారని ఆరోపించింది. అయితే, అసలు విషయం ప్రజలకు తెలుసుననేది వైయస్ జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా కూడా రుజువైంది. ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో అనిల్ కుమార్‌కు వాటాలున్నాయనే విషయంపై వారు జగన్‌ను ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాజెక్టుకు అనుమతిచ్చిన విషయంపై కూడా వారు అడిగారు.

English summary
TV Channel Studio N belongs to TDP president N Chandrababu Naidu's son Nara lokesh exposed the story of East Coast Thermal power project issue. IT alleged that YS Rajasekhar Reddy;s brother YS Ravindra Reddy and son - in - law Anil kumar are having shares in that project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X