మీడియాపై గుర్రుమంటున్న వర్మ

Ram Gopal Varma
ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెర తీశారు. అప్పల్రాజు సినిమా ఆయనను ఈ వివాదంలోకి లాగింది. అప్రల్రాజు సినిమాలో మీడియా ప్రతినిధిని చూపించిన తీరుపై ఓ టీవీ చానెల్ భగ్గుమంది. దీంతో ఆయన తిప్పల్లో పడ్డారు. తాను ఎవరిని ఉద్దేశించి ఆ పాత్రను పెట్టలేదని ఆయన అదే టీవీ చానెల్‌తో చెప్పుకున్నారు. మీడియా ప్రతినిధి వణుకుతూ ఎదుటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా అని టీవీ చానెల్ ప్రతినిధి అడిగితే ఆయన సరిగా సమాధానం చెప్పలేకపోయారు.

తన సినిమాలో తెలుగు సినిమాపై దుమ్మెత్తి పోసిన వర్మ ఓ టీవీ చానల్ తనను ఉతికి ఆరేస్తోందని ఆవేదన చెందారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్‌కు ఫిర్యాదు చేయడానికి శుక్రవారం వెళ్లారు. మీడియాపై వేసిన సెటైర్లకు ఆ టీవీ చానెల్ వర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఓ చేత్తో ల్యాప్‌టాప్, మరోచేత్తో మీడియా ప్రసారాల నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని పట్టుకుని వచ్చిన వర్మ, కమిషనర్‌ను కలిశారు. సదరు చానల్ అప్పల్రాజు సినిమాపై ప్రసారం చేసిన కథనాన్ని ల్యాప్‌టాప్‌లో ఆయనకు చూపించారు. ఆ చానల్ తనను వ్యక్తిగతంగా దూషించిందని తెలిపారు. ఆ చానల్ నిబంధనలు అతిక్రమించినట్టు చెప్పారు. అయితే, మౌఖిక ఫిర్యాదు వల్ల తాము చేసేదేమిలేదని కమిషనర్ ఖాన్ తేల్చిచెప్పడంతో మళ్లీ వచ్చి కలుస్తానంటూ వర్మ వెనుదిరిగారు. రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడానికి ఆయన ముందుకు రాలేదు.

తనకు పిచ్చెక్కిందని, మైండ్ దొబ్బిందని దూషిస్తూ టీవీ 9 కథనం ప్రసారం చేసిందన్నారు. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. మళ్లీ వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాను ఇదంతా ప్రచారం కోసం చేయడం లేదని వర్మ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+