వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు టార్గెట్ కెవిపి, మంత్రులు?

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao
తన ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కోనున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావును టార్గెట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. వైయస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన కెవిపి, వైయస్ మంత్రివర్గంలో పనిచేసిన బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, రఘువీరా రెడ్డి వంటి మంత్రులను కూడా లక్ష్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు న్యాయస్థానాలను వేదిక మార్చుకోవాలని అనుకుంటున్నట్లు ఓ దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో అక్రమాలకు బాధ్యులను చేస్తూ కెవిపి రామచందర్ రావుపై, కొంత మంది మంత్రులపై న్యాయస్థానానికి వెళ్లాలని తెలుగుదేశం ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వ సలహాదారుగా కెవిపి రామచందర్ రావు పాత్ర ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకమైందని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వాదిస్తోంది. కెవిపి రామచందర్ రావుపై, మంత్రులపై తమ సీనియర్ పార్టీ నేత యనమల రామకృష్ణుడి చేత పిటిషన్ వేయించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుటుంబ సభ్యులపై పిటిషన్ వేసిన తర్వాత కెవిపి రామచందర్ రావు, కొంత మంది మిత్రులపై మరో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పిటిషన్‌లో వారిపై పొందుపరచాల్సిన ఆరోపణలను కూడా క్రోడీకరించినట్లు తెలుస్తోంది. భూముల కేటాయింపు, జలయజ్ఢం వంటి వాటిలో అవినీతి జరిగిందని తెలుగుదేశం విమర్శలు చేస్తూ వస్తోంది.

English summary
According to reports - Telugudesam may approach court on Congress MP KVP Ramachandar Rao and few ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X