రాజీనామాలు: చిగురిస్తున్న జగన్ ఆశలు

YS Jaganmohan Reddy
రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనే వైయస్సార్ కాంగ్రెసు వైయస్ జగన్ ఆశలు మళ్లీ చిగుళ్లు వేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు శాసనసభ్యులు రాజీనామాలు చేయడంతో వైయస్ జగన్ శిబిరంలో ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ అంశంపై ప్రభుత్వం పడిపోవడానికి అవసరమైన చేయూత అందించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైయస్ జగన్ వర్గానికి చెందిన 28 మంది శానససభ్యులు రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని జగన్ వర్గం శాసనసభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయి. ఈ ముగ్గురితో కాంగ్రెసుకు రాజీనామాలు చేసే తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య ఆగిపోదనే సంకేతాలు అందుతున్నాయి.

చాలా మంది కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తారని, కాంగ్రెసు డబ్బా ఖాళీ అవుతుందని కాంగ్రెసు పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసిన జూపల్లి కృష్ణారావు అన్నారు. నవంబర్ 10వ తేదీ లోపల మరింత మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారని రాజయ్య చెప్పారు. తాము చెరువుకు కోత పెట్టామని, త్వరలోనే గండిపడుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి కాంగ్రెసు నుంచి మరింత మంది శాససభ్యులు కాంగ్రెసు నుంచి తప్పుకుంటారని అంటున్నారు.

కాంగ్రెసుకు చెందిన శాసనసభ్యులు మరింత మంది శాసనసభ్యులు రాజీనామాలు చేస్తున్న క్రమంలో తన వ్యూహానికి పదును పెట్టాలనే ఆలోచనలో జగన్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు శాసనసభ్యుల రాజీనామాల వల్ల పెద్దగా నష్టం లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంటున్నా పరిస్థితి అంత సజావుగా లేదనేది అర్థమవుతూనే ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు ఇంకా కాంగ్రెసులో ఉన్నారని అంటున్నారు. దాదాపు 30 మంది శాసనసభ్యులు జగన్ వెంట ఉన్నారు. వారికి తోడు తెలంగాణకు చెందిన మరో 30 మంది తోడైతే ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడుతుంది. అందుకు వ్యూహం రచించి అమలు చేసే దిశగా జగన్ సాగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏమైనా, జగన్ శిబిరంలో కాస్తా ఆశలు చిగురిస్తున్నట్లే కనిపిస్తోంది. మరో పది మంది శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడుతుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+