డ్రగ్స్ రాకెట్లో సినీ ప్రముఖులు

Murali Srinivas
టాలీవుడ్‌ను డ్రగ్స్ రాకెట్ మరోసారి కుదిపేసింది. సినీ నటి, హీరో రాజశేఖర్ సతీమణి జీవిత తమ్ముడు మురళీ శ్రీనివాస్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడడంతో మారో సారి టాలివుడ్‌లో కలకలం చెలరేగింది. పోలీసులు ఇందులో మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 305 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో మురళి డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డైరీలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ హీరోలు, హీరోయిన్ల పేర్లతో పాటు మరికొంత మంది పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మురళీ మాదకద్రవ్యాలను సరఫరా చేసే పనికి కుదురుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో తాను ఎవరెవరికి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడో వారి పేర్లను ఆ డైరీలో రాసుకున్నట్లు భావిస్తున్నారు.

మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న సినీ ప్రముఖుల పేర్లు పోలీసులకు తెలిసినప్పటికీ చట్టంలో ఉన్న లొసుగుల వల్ల చర్యలు తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ప్రధానంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తీరులోని మూడు బృందాలను ఏర్పాటు చేసి మురళిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. అదే తరహాలో మిగతా వారికి కూడా గాలం వేయాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. హీరో రవితేజ సోదరులు భరత్, రఘు పట్టుబడిన తర్వాత టాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మురళీ పట్టుబడినట్లు చెబుతున్నారు.

నైజీరియాకు చెందిన డేనియల్, పదవీ విరమణ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి చంద్రమోహన్ కుమారుడు భానుచందర్‌ అలియాస్ న్యాష లతో కలిసి మురళి టాలీవుడ్‌లో మాదకద్రవ్యాల విక్రయాన్ని సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు మురళితో పాటు డేనియల్, న్యాష్, మురళి అనుచరుడు పరిటాల రాంబాబులను శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు 15 లక్షల రూపాయల విలువ చేసే 305 గ్రాముల కొకైన్, కారు, సెల్ ఫోన్, డైరీలను స్వాధీనం చేసుకున్నారు. మురళీకి చెందిన డైరీ ద్వారా టాలీవుడ్ డొంకంతా కదులుతుందని అంటున్నారు.

కాగా, టాలీవుడ్‌ను మాదకద్రవ్యాల రాకెట్, వ్యభిచారం, మాఫియా కుదిపేస్తున్నాయి. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌తో టాలీవుడ్‌కు ఉన్న సంబంధాలు ఇటీవలే బయటపడ్డాయి. వర్ధమాన తారలు సైరాభాను, జ్యోతి అరెస్టు, ఈ మధ్య హీరోయిన్ యమున అరెస్టులతో సెక్స్ రాకెట్ గుట్టు బయటపడింది. రవితేజ సోదరుల అరెస్టుతో మాదక ద్రవ్యాల రాకెట్ మూలాలు తెలుస్తున్నాయి. సైరాభాను, జ్యోతిలతో సెక్స్ రాకెట్ నడిపినవారికి మాదక ద్రవ్యాలతో గల సంబంధాలపై కూడా పోలీసులు అప్పట్లో ఆరా తీశారు. ఈ మూడు రాకెట్లు ఒకదానికొకటి పెనవేసుకుని పోయాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+