'పద్మనాభ గుడి'లాగా ఐదు వరల్డ్ టాప్

Anantha Padmanabha Swamy Temple
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అపార నిధులు బయటపడిన విషయం తెలిసిందే. ఆలయంలోని ఐదు నేలమాళిగలలో భారీగా నిధులు బయటపడటమే కాకుండా ఆరో నేలమాళిగపై ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఆరో నేలమాళిగపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ 22కు వాయిదా వేసింది. అయితే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భారీగా నిధులు దొరికిన మాదిరిగా ప్రపంచంలో గుప్తనిధులు దొరికిన టాప్-5 ప్రదేశాలు.... ఈజిప్టులోని టుటెన్ కామన్ మొదటిది. క్రీస్తు పూర్వం పదమూడు, పద్నాలుగో శతాబ్దం కాలంలో టుటెన్ కామన్ అనే రాజుకు 18 ఏళ్ల వయస్సులోనే కాలికి గాయం అయి మానలేదు. దాంతో అతను మృతి చెందినట్లుగా ప్రజలు చెప్పుకునే వారు. మలేరియా కారణంగా కూడా ఆయన మరణించినట్లు అక్కడి వారు చెప్పుకుంటారు. అయితే టుటెన్ కామన్ బతికి ఉన్న ఆ కొద్ది రోజుల్లోనే భారీగా నిధులు, ఆభరణాలు సమర్పించారు. ఆయన సమాధిని ఉన్న ప్రాంతాన్ని రాజుల లోయగా పిలుస్తారు. అయితే అక్కడ భారీగా గుప్త నిధులు ఉన్నాయని తెలియడంతో రాజుల లోయ ప్రాంతంలోని టుటెన్ సమాధి కోసం అన్వేషణ జరిపారు. అయితే ఏడేళ్ల అన్వేషణ అనంతరం కానీ టుటెన్ సమాధి కనిపించలేదు. అక్కడ భారీగా నిధులు, ఆభరణాలు బయట పడ్డాయి. ఎంతగా అంటే వాటిని తరలించడానికి సుమారు దశాబ్ద కాలం పట్టిందంటే అక్కడ ఎంత నిధి దొరికిందో ఊహించుకోవచ్చు.

ఇక రెండోది ఆప్గనిస్తాన్‌లోని బాక్టియా. బాక్టియాలోని ఏడు సమాధులలో భారీగా నిధులు ఉన్నాయని తెలియడంతో ఆర్టియాలజిస్టులు వాటిని తెరిచారు. ఏడింటిలో ఆరింటిని మాత్రమే ఇరవయ్యవ శతాబ్దం చివరలో తెరిచారు. ఆరింటిలో భారీగా బంగారు ఆభరణాలు దొరికాయని సమాచారం. అయితే 1997 సంవత్సరం నుండి అవి ఒక్కసారిగా కనిపించకుండా పోయాయి. దీంతో ఏదో మాయ అని ప్రజలు అభిప్రాయపడ్డారు. కానీ 2003వ సంవత్సరంలో కాబుల్‌లోని సెంట్రల్ కేంద్రంలో వాటిని భద్రపరిచినట్లుగా బయటకు పొక్కింది. అంత పెద్ద మొత్తంలో ఉన్న ఆభరణాలు ఉగ్రవాదుల చేతుల్లో పడితే ప్రమాదమని భావించిన అప్పటి కాబుల్ అధినేత నజీబుల్లా వాటిని రహస్యంగా తరలించినట్లుగా సమాచారం. సోవియట్ కాలంలో కూలిపోయిన ఆప్గన్ సంస్కృతికి ప్రతిరూపంగా కేవలం ఈ ఆభరణాలు మాత్రమే మిగిలాయంట.

రోమ్‌లోని థామస్ ఆరా మరో ప్రధానమైనది. 15వ శతాబ్దంలో నీరో చక్రవర్తి కాలంలో ఓ గుహలో థామస్ ఆరా అనే అద్భుత భవనాన్ని నిర్మించారంట. ఆ భవనం 300 వందల ఎకరాల విస్తీర్ణంలో 300 వందల గదులతో నిండి ఉండటం విశేషం. ఆ గదిలో ఎలాంటి పడక గది, వంట గది ఉన్న ఆనవాళ్లు లేవు. అంతేకాకుండా ఆ గదుల నిండా చిత్ర లేఖనాలు నిండిపోవడంతో ఆ భవనాన్ని నివాసంగా కాకుండా కళాఖండాల కోసమే నిర్మించినట్లుగా చరిత్రకారులు భావించారు. అ భవనంలో భారీగా నిధులు ఉన్నాయని గదులన్నింటినీ ఎక్కడికక్కడ నాశనం చేశారు. అయితే గదులు దెబ్బతిన్నప్పటికీ గోడలపై ఉన్న చిత్ర కుడ్యాలు మాత్రం చాలా వరకు అలాగే ఉండి పోయాయి. అయితే ప్రస్తుత వాతావరణ ప్రభావం వాటిపై పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే మైఖేల్ ఏంజెల్ వంటి ప్రముఖ ఆర్టిస్టులు వాటిలో కొన్నింటికి నకళ్లను సిద్ధం చేశారు.

నాలుగోది అసిరియాలోని నిమ్రోన్. బైబిల్ కాలంనాటి నిమ్రోన్ ఎప్పుడో చరిత్ర పుటల్లో మరుగున పడి పోయింది. 1980ల వరకు అది ఎవరికి తెలియని స్థితియ అయితే ఆ తర్వాత అక్కడి రాజప్రసాదాల్లో అసంఖ్యాక మణులు, బంగారు వస్తువులు, శిల్ప విశేషాలు కనిపించాయి. ఇక ఇజ్రాయెల్‌లోని డెడ్ సీ స్క్రోల్ ఐదోది. ఇది మిగిలిన వాటన్నింటికి భిన్నమైనది. ఈ ప్రాంతంలో కుంగాన్ అనే గొర్రెల కాపరికి హిబ్రూ, అరబిక్ భాషలలో ముఖ్యమైన పత్రాలు కనిపించాయి. నాటి యూదుల్లోని ఓ వర్గం వాటిని రాసినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆ పత్రాలలో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉండి ఉంటాయని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే ఆ పత్రాలలో పలు వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయంట. ఆ పత్రాలలో మతపరమైన వివాదాస్పద అంశాలు ఉంటడంతో కొన్నేళ్లపాటు వాటికన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక్కడ నిధులు కాకుండా ముఖ్యమైన పత్రాలు మాత్రం దొరికాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+