వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు పొలిటికల్ మెగా స్టార్ చిరంజీవే....

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: ఎన్నికలు సమీపించే కొద్దీ కేంద్ర మంత్రి చిరంజీవి ప్రాధాన్యత రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో పెరుగుతుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మెగా ప్రచార సారథి ఆయనే అవుతారని అంచనా వేస్తున్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయన కాంగ్రెసు పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తారని అంటున్నారు. గత ఉప ఎన్నికల్లో చిరంజీవి కృషివల్లే రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2014 లో జరిగే అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం చిరంజీవినే ప్రధాన ప్రచారకర్తగా కాంగ్రెస్‌ నాయకత్వం తెరపైకి తీసుకొచ్చే అవకాశముందని పార్టీ వర్గాలంటున్నాయి.

రాజ్యసభసభ్యుడిగా చిరంజీవిని ఎంపికచేయడమే కాకుండా పిసిసి, ప్రభుత్వానికి మధ్య వేసిన సమన్వయ కమిటీలో కూడా ఆయన సభ్యుడు. అంతేకాకుండా ఇటీవ ల జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణలో స్వతంత్ర హోదా తో మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇవన్ని మున్ముందు కాంగ్రెస్‌కు మెగా ఇమేజ్‌ తెచ్చిపెట్టేందుకేనని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. వెైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన నాయకుడు లభించని పరిస్థితి ఏర్పడింది.

కానీ కొంతకాలం కిందట జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున చిరంజీవి తీవ్రంగానే యత్నించారు. రెండు స్థానాలు గెలుపోందినా మిగితా స్థానాల్లో మాత్రం ఆ ఎన్నికల్లో పరాజయమే ఎదు రెైంది. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం సెంటిమెం టు, నాడు నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో ఆ ఎన్నికలు జరగడంవల్లేనని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది.

ఈ కారణంగానే చిరంజీవిని మున్ముందు 2009లో జరిగే సాధారణ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపేయినర్‌గా చేయాలన్న ఆలోచన ఆ పార్టీ హైకమాండ్‌ మదిలో కొనసాగుతున్నట్లు సమాచారం. పర్యాటక శాఖకు మీరే బ్రాండ్‌ అంబాసిడర్‌ అని చిరంజీవిని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రశంసించిన ఉద్దంతాన్ని ఆయన సన్నిహిత వర్గాలు గుర్తుచేస్తున్నాయి. చిరంజీవి చరిష్మ ఏమిటో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వ్యాఖ్యను బట్టే చిరంజీవి ప్రాధాన్యం అర్థమవుతోందని అంటున్నారు.

ఈ కారణం చేతనే సరెైన సమయంలో చిరంజీవికి కేంద్ర మంత్రివర్గంలో స్వతంత్ర హోదాతో శాఖను కేటాయించారని చెబుతున్నారు. టిడిపికి ఆ పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్‌టిఆర్‌, హరికృష్ణ - ఇలా ఎన్‌టిఆర్‌ కుటుంబ అండ మొత్తం ఉంది. ఇక వెైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి జగన్‌ జెైలులో ఉన్నా వైయస్ సతీమణి వెైయస్ విజయమ్మ, ఆయన కూతురు షర్మిల స్టార్‌ క్యాంపేయినర్‌గా ఉన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీకి జనంలో పట్టున్న స్టార్‌ క్యాంపేయినర్‌ చిరంజీవి ఒక్కరేనని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీకి నమ్మిన బంటుగా చిరంజీవి ఉంటారన్న భావన కూడా ఆ పార్టీ హైకమాండ్‌లో నెలకొంది. అయితే కాంగ్రెస్‌ పార్టీలో తన వర్గాన్ని దూరం పెడుతున్నారని, ఇతర కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తమ నాయకులను కిందిస్థాయిలో కలుపుకొని వెళ్లడంలేదని చిరంజీవి సహా ఆయన సన్నిహితులెైన మంత్రి రామచంద్రయ్య పలుమార్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అసంతృప్తి నివారణ దిశగా కాంగ్రెస్‌ నాయకత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

English summary

 The union minister Chiranjeevi will be the star compaigner for Congress in coming election. Chiranjeevi's importance will grow in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X