వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపివారి ఆధిక్యత వల్లనే నందులకు టోకరా?

By Pratap
|
Google Oneindia TeluguNews

No Nandi awards this year too
ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులు ప్రదానోత్సవం ఈసారి కూడా జరిగే అవకాశం లేనట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగుదేశం పార్టీ వారు ఎక్కువగా ఉండడం వల్లనే నంది అవార్డుల ప్రదానోత్స కార్యక్రమం పట్ల కాంగ్రెసు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరాసక్తత ప్రదర్శిస్తోందనే మాట వినిపిస్తోంది. చివరిసారి నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం 2010 మార్చి 17వ తేదీన జరిగింది. అది కూడా 2008 నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం.

తెలుగుదేశం పార్టీ వారు ఎక్కువగా ఉన్నారనే దానికన్నా తెలుగు సినీ పరిశ్రమ రెండుగా విడిపోయింది. రాజకీయంగా రెండు గ్రూపులుగా విడిపోయిందనే విషయం కొత్త విషయమేమీ కాదు. ఈ రాజకీయాల వల్ల ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు సంబంధాలు పెద్దగా కొనసాగడం లేదు. 2009, 2010 నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు వాటిని ప్రదానం చేయలేదు. 2011 అవార్డులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రాజకీయ కారణాల వల్లనే నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగడం లేదని అంటున్నారు.

నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయం ఇస్తే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, తగిన సమయంలో ఆ కార్యక్రమం ఉంటుందని సంస్థ అధికారులు అంటున్నారు.

English summary
The prestigious Nandi film awards are unlikely to take place this year also. The last time the function was held was on March 17, 2010 to give away the awards for the year 2008.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X