వైయస్సార్ అనుచరుల్లో వణుకు?

YS Rajasekhar Reddy
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విధేయుల్లో వణుకు పుడుతోందని వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ ప్రియ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావును సిబిఐ విచారించడంతో వైయస్సార్ మనుషుల్లో భయం చోటు చేసుకుందని అంటున్నారు. కెవిపి రామచంచర్ రావునే విచారించిన సిబిఐ ఎవరినైనా విచారిస్తుందనే అభిప్రాయం వారిలో కలిగినట్లు చెబుతున్నారు. రామచందర్ రావును ఇంత త్వరగా విచారణకు పిలుస్తుందని ఎవరూ ఊహించలేదని అంటున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కెవిపి రామచందర్ రావును సిబిఐ సాక్షిగా మాత్రమే ప్రశ్నించింది. అయితే, ఏ కేసులోనైనా ఎప్పుడైనా ఎవరినైనా సిబిఐ విచారణకు పిలిచే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలు కెవిపి విచారణ ద్వారా అందించినట్లు భావిస్తున్నారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ సాక్షిగా విచారించింది. వైయస్సార్ హయాంలో కెవిపి రామచందర్ రావు ఎంతో అధికారాన్ని అనుభవించారు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు ఆయన కోసం బారులు తీరేవారు. కెవిపిని ఇంత వేగంగా విచారణకు పిలుస్తుందని తాము అనుకోలేదని కాంగ్రెసు వర్గాలంటున్నాయి. కాంగ్రెసులోని మరింత మంది పెద్దలను సిబిఐ విచారించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాను సిబిఐ సాక్షిగా విచారించిందని, విల్లా కొనుగోలుపై సమాచారం అడిగారని, తాను తనకు తెలిసిన వివరాలు చెప్పానని కెవిపి రామంచందర్ రావు అన్నారు. అంతకు మించి ఆయన ఏమీ చెప్పలేదు. తన భార్య పేరు మీద కెవిపి విల్లాను కొనుగోలు చేశారు. కెవిపిని సిబిఐ ప్రశ్నించడం ప్రారంభం మాత్రమేనని, మరింత మంది పెద్దలను సిబిఐ విచారిస్తుందని అంటున్నారు. విల్లాల కొనుగోలుకు సంబంధించి సిబిఐ ఇంతకు ముందు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను, కొంత మంది సినీ ప్రముఖులను విచారించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+