కేబినెట్ లోకి రాములమ్మ,కోదండ రాం..పీసీసీ చీఫ్ మార్పు - ఆ ముగ్గురూ ఔట్..కొత్తగా..!!

ముఖ్యమంత్రి రేవంత్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వం - పార్టీ ప్రక్షాళన దిశగా హైకమాండ్ తో చర్చలు చేసారు. మంత్రివర్గంలో మార్పుల పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రేవంత్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాములమ్మ తో పాటుగా కోదండరాంకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో ఇద్దరిని తెలిగించే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్తగా ముగ్గురు కేబినెట్ లోకి రానున్నారు.

ఇక.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సీఎం రేవంత్ కొత్త నిర్ణయాల పై కసరత్తు చేస్తున్నారు. మే 4న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీలో ప్రచారం సాగుతోంది. మంత్రి వర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరాం .. విజయశాంతికి అవకాశం ఇవ్వాలనేది ఏఐసీసీ ఆలోచనగా తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. దీంతో, కోదండరాం కు మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించటం ద్వారా ప్రొఫెసర్ గా ఆయన అనుభవం ఉపయోగపడు తుందని భావిస్తున్నారు. అదే విధంగా ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతికి గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అదే సమయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. మరో బీసీ నేతను పీసీసీ చీఫ్ గా చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.

అప్పటి వరకు పెట్రోల్, డీజిల్ పరిస్థితి అంతే - సగానికి పైగా బంకుల మూసివేత..!!
అప్పటి వరకు పెట్రోల్, డీజిల్ పరిస్థితి అంతే - సగానికి పైగా బంకుల మూసివేత..!!
revanth-reddy-in-talks-with-aicc-cabinet-reshuffle-buzz-grows-two-names-emerge-here-the-details

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత

ఇక.. ఇద్దరి మంత్రులకు ఉద్వాసనతో పాటుగా కీలక శాఖల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను డిప్యూటీ సీఎంగా బీసీ కోటాలో చేసే ప్రతిపాదన పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత కేబినెట్ లో ఎస్సీ వర్గం నుంచి భట్టివిక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దామోదర్‌ రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌ మంత్రులుగా కొనసాగుతున్నారు. కాగా, బీసీల నుంచి పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. వీరికి అదనంగా మరొకరిని డిప్యూటీ సీఎంగా తీసుకుం టే బీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని లెక్కలు వేస్తున్నారు. కాగా, మహేష్ గౌడ్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తే.. టీపీసీసీకి కొత్త చీఫ్‌గా ప్రస్తుతం ఉన్న బీసీ మంత్రుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా, టీపీసీసీ చీఫ్ గా పొన్నం ప్రభాకర్ పేరు పైన చర్చ జరుగుతోంది. మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు తీసుకురావాలన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రిని తొలిగించటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+