కొత్త పెన్షన్లు వీరికే, తాజా నిర్ణయం - దరఖాస్తులు.. మార్గదర్శకాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేసింది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి విధి విధానాలు నిర్దారించిన ప్రభుత్వం.. పంపిణీ పైన మార్గదర్శకాలు వెల్లడించింది. దీనికి సంబంధించిన గడువు పొడిగించింది. అర్హతల పైనా స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం.. ఎవరు పెన్షన్లకు అర్హులు కాదనేది తేల్చి చెప్పింది. క్షేత్ర స్థాయి నుంచి ఈ మొత్తం ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు.

తెలంగాణలో ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి అర్హత ఉన్న వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయింది. తొలి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నుంచి 3.5లక్షల మందికి విడతల వారిగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు అనారోగ్యంతో ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దరఖాస్తుల తుదిగడువు ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

 శ్రీవారి భక్తులకు కొత్తగా భారీ వసతి సముదాయం, ఇక వీరికి అక్కడే కేటాయింపు- కీలక మార్పు..!!
శ్రీవారి భక్తులకు కొత్తగా భారీ వసతి సముదాయం, ఇక వీరికి అక్కడే కేటాయింపు- కీలక మార్పు..!!
telangana-govt-latest-guide-lines-for-sanction-of-new-pensions-to-the-eligible-beneficiaries-here-t

ప్రభుత్వం తాజా నిర్ణయంతో

కాగా.. దివ్యాంగులకు రూ.4,016 ఇతరులకు రూ.2,016 ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో సర్కార్ పేర్కొంది. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారం చేయూత పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు.. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు/ఆహార భద్రత కార్డు లేదంటే రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ పమర్పించాలి. కేటగిరీని బట్టి అదనపు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. మూడెకరాలకు మించి నీటి పారుదల భూమి లేదంటే 7.5ఎకరాలకు మించి పొడి భూమి ఉన్న వారిని అనర్హులుగా గుర్తించింది. అదే విధంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబ సభ్యులు అనర్హులుగా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+