FCRA Bill పై కేంద్రం కీలక నిర్ణయం: ఇక అన్నింటికీ తెర దించినట్టే.. !!

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు (FCRA Amendment Bill) పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి వ్యక్తమవుతున్న పలు అభ్యంతరాల నేపథ్యంలో.. ఈ వివాదాస్పద బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని నిర్ణయించింది. దీనిపై లోక్ సభలో ఓ తీర్మానాన్ని కూడా కొద్దిసేపటి కిందటే ప్రవేశపెట్టింది.

ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లుపై కేంద్రం యూటర్న్ తీసుకున్నట్టయింది. దీన్ని జేపీసీ పరిశీలనకు పంపడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో లోక్ సభ, రాజ్యసభలో ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తోన్న ప్రతిష్టంభనకు కేంద్రం తెరదించినట్టయింది. వివాదాలు, విమర్శలకు ముగింపు పలికినట్టయింది. దీన్ని పరిశీలించడానికి ప్రత్యేకంగా జేపీసీని వేసే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం.

Central Govt to Refer FCRA Amendment Bill 2026 to JPC as Opposition Pushback Grows Seek changes

కాగా.. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలంటూ మొదటి నుంచీ ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తూ వస్తోన్నాయి. దీనిపై పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను స్తంభింపజేస్తోన్నాయి. అటు దేశంలోని సామాజిక సంస్థలు, వివిధ చర్చి అనుబంధ సంఘాలు కూడా ఈ బిల్లులో ప్రతిపాదించిన కొన్ని మార్పులపై క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి.. విదేశీ విరాళాల ద్వారా గతంలో సమకూర్చుకున్న ఆస్తులకు సంబంధించిన నిబంధనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమౌతోంది.

సూర్యగ్రహణ సమయంలో ఆ కుగ్రామంలో జరిగే అరుదైన వింత..!!
సూర్యగ్రహణ సమయంలో ఆ కుగ్రామంలో జరిగే అరుదైన వింత..!!

ఈ బిల్లులో పొందుపరిచిన ఆస్తుల స్వాధీన నిబంధనలు తమ ఉనికికే ప్రమాదకరంగా మారుతాయని పలు మత సంస్థలు ఆందోళన చెందుతోన్నాయి. గతంలో సేకరించిన విదేశీ నిధుల ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయడానికి లేదా నాటి పెట్టుబడులను స్తంభింపజేయడానికి ఈ తాజా ప్రతిపాదనలు వీలు కల్పిస్తాయని ఆరోపించాయి. దీనివల్ల ప్రార్థనా మందిరాలు, సేవా కార్యక్రమాలు నిలిచిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశాయి.

మళ్లీ కత్తి నూరుతోన్న టెక్ జెయింట్.. !!
మళ్లీ కత్తి నూరుతోన్న టెక్ జెయింట్.. !!

ఈ పార్లమెంటరీ కమిటీ పరిశీలన ద్వారా బిల్లులోని వివాదాస్పద అంశాలపై త్వరలోనే పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను సేకరించిన తర్వాతే తుది బిల్లుపై పార్లమెంట్‌లో తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. దీనివల్ల ఇటు ఉభయ సభల్లో చర్చ సాఫీగా సాగడంతో పాటు, ప్రజాసంఘాల ఆందోళనలకు కూడా ప్రభుత్వం సానుకూల పరిష్కారం చూపినట్లవుతుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+