PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదల షెడ్యూల్ ఫిక్స్, ఈ సారి ఇలా చేస్తేనే..!!
పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ అప్డేట్. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ 6 వేలు జమ చేస్తోంది. ఇప్పటి వరకు 22 సార్లు ఈ నిధుల జమ చేసారు. 23వ విడత నిధుల పైన స్పష్టత వచ్చింది. ఇదే సమయంలో అర్హులైన రైతులకు అధికారులు కీలక సూచన చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కేవైసీ పూర్తి చేయని రైతులకు ఈ సారి నిధులు జమ కావని తేల్చేసారు. ఇందు కోసం ఈ ప్రక్రియ పూర్తి చేయటానికి విధి విధానాలు ఖరారు చేసారు.
పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం 22వ విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గత నెల 13నే గౌహతిలో ప్రధాని మోదీ 22వ విడత విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా, ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో విడుదలవుతాయి. 22వ విడత మార్చిలో విడుదల చేయటంతో.. ఇక, 23వ విడత జూలైలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా.. ఈ సారి నిధులు జమ కావా లంటే రైతులు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని అధికారులు కీలక సూచనలు చేసారు. బ్యాంకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ యాక్టివ్ గా ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలి. లేకపోతే డబ్బులు క్రెడిట్ కావు.

రైతులకు కీలక సూచనలు
కాగా, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ కేవైసీ కూడా తప్పనిసరి. ఇది ఆన్‌లైన్లో పూర్తి చేసుకోవొచ్చు. https://pmkisan.gov.in/ లో కేవైసీ యాక్టివ్ చేయవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్తే కూడా వాళ్ళు ఈ సర్వీస్ అందజేస్తారు. ఆన్‌లైన్‌లో చేయడం వీలుకాకపోతే, మీ దగ్గర్లోని సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి అక్కడ అప్‌డేట్ చేసుకోవచ్చు. అక్కడ బయోమెట్రిక్ ద్వారా మీ ఇ-కేవైసీ పూర్తి చేసి, కొత్త నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్లు 155261 లేదా 1800115526 కు కాల్ చేయవచ్చు.
మొబైల్ నెంబర్ కూడా యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోవటం ద్వారా పీఎం కిసాన్ నిధుల అప్డేట్స్ ఎప్పటికప్పుడు మొబైల్ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. కేంద్రం సూచించిన విధంగా ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు మంజూరు అవుతాయి.













Click it and Unblock the Notifications