Fuel Crisis: పెట్రోల్, డీజిల్ కావాలంటే ఇది తప్పనిసరి..! సర్కార్ ఆదేశాలు..!

దేశవ్యాప్తంగా చమురు (Fuel)కొరత తాండవిస్తోంది. చమురు కంపెనీలు (Oil companies) పెట్రోల్ బంకులకు సరఫరా చేసే పెట్రోల్, డీజిల్ నిబంధనలు మార్చడంతో చాలా రాష్ట్రాల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం కూడా రంగంలోకి దిగుతోంది. అయితే అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ కావాలంటే వాహనదారులకు ఓ షరతు పెట్టింది.

పెట్రోల్ బంకులు బంద్, రంగంలోకి సీఎం చంద్రబాబు
పెట్రోల్ బంకులు బంద్, రంగంలోకి సీఎం చంద్రబాబు

వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం తాజాగా పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ నిబంధనననిు తప్పనిసరి చేసింది. కాలుష్య ధృవీకరణ పత్రం లేకపోయే వాహనాల్లో ఇంధనం నింపొద్దంటూ పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులకు ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఢిల్లీ పర్యావరణ, అటవీ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం... చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్‌ను సమర్పించిన తర్వాత మాత్రమే మోటారు వాహనాలకు ఇంధనం (పెట్రోల్/డీజిల్/CNG/LPG) అందిస్తారు.

No Certificate No Fuel Delhi Gets Strict Petrol Pumps Begin Turning Away Vehicles
Kisan Mitra Chhadi: రైతన్నలకు కేంద్రం సూపర్ గిఫ్ట్:
Kisan Mitra Chhadi: రైతన్నలకు కేంద్రం సూపర్ గిఫ్ట్:

1989 నాటి కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబందనల్లోని రూల్ 115 యొక్క సబ్-రూల్ (7)ప్రకారం అమలు చేస్తున్నారు. ఈ నిబంధన ప్రకారం, మొదటి రిజిస్ట్రేషన్ తేదీ నుండి ఒక సంవత్సరం తర్వాత, ప్రతి వాహనం తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. అలాగే రూల్ 116 కింద అధికారులు కోరినప్పుడు దానిని సమర్పించాలి. ఇందులో విఫలమైతే మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు తప్పవు. దీంతో ఇప్పుడు ఈ నిబంధనను పెట్రోల్, డీజిల్ పోయడానికి వర్తింపచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+