వైయస్ జగన్ అరెస్టుకు తాజా ప్రయత్నం?

అరెస్టు నుంచి తప్పించుకోవడానికే వైయస్ జగన్ ఓదార్పు యాత్రను వాడుకుంటున్నారని సిబిఐ వర్గాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఆయన దాదాపు 50 రోజుల పాటు ఓదార్పు యాత్ర చేశారు. నిజానికి, ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్ రావాల్సి ఉంది. జగన్ ఓదార్పు యాత్ర పూర్తిగా రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోంది. తొలుత తన తండ్రి వైయస్సార్ ప్రజలకు చేసిన సేవలను తెలియజేస్తూ జగన్ ఓదార్పు యాత్రను సాగించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై విమర్శనాస్త్రాలు సంధించడానికి ఉపయోగించుకోవడం ప్రారంభించారు.
అరెస్టును తప్పించుకోవడానికే వైయస్ జగన్ ఎడతెరిపి లేకుండా ఓదార్పు యాత్ర చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇంత దీర్ఘకాలం ప్రజల్లో తిరిగిన రాజకీయ నాయకుడు జగన్ తప్ప మరొకరు లేరని అంటున్నారు. ప్రజల్లో ఉండడం ద్వారా అరెస్టు నుంచి తప్పించుకోవాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. శనివారం సిబిఐ దాఖలు చేసినప్పుడు కూడా ఆయన గుంటూరు నగరంలో పర్యటించారు. సిబిఐ చార్జిష్టీట్ గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సిబిఐ అరెస్టు చేస్తే ప్రజల నుంచి ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చేలా ఆయన ప్రజల మధ్యనే ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications