హరి కోపం వెనుక..: ఎన్టీఆర్ శత్రువింటికి బాలకృష్ణ!
స్వర్గీయ నందమూరి తారక రామారావును వ్యతిరేకించిన బంధువు ఇంటికి హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ వెళ్లడం చర్చనీయాంశమైంది. సినిమాల్లో, రాజకీయాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నా ఎన్టీఆర్ నిమ్మకూరును మర్చిపోలేదు. గ్రామానికి ఆయన ఎంతో చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అనేక వినూత్న పథకాలను ఆయన తన గ్రామంలో కూడా అమలు చేశారు.
1987 ఆగస్టులో వివిధ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రిగా నిమ్మకూరు వచ్చేందుకు ఎన్టీఆర్ పర్యటన ఖరారైన సమయంలో ఆయన తోడల్లుడు నందమూరి చంద్రం కుమారుడు వెంకటరత్నం పార్టీ జెండా దిమ్మెను కూల్చడం ఆయన మనసును కలిచివేసింది. దాంతో ఆయన ఆ గ్రామానికి దూరమయ్యారు. నిమ్మకూరు రానని ఎన్టీఆర్ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. పట్టుదలకు మారు పేరైన ఎన్టీఆర్ కన్నుమూసే వరకూ నిమ్మకూరువైపు కన్నెత్తి చూడలేదు.

ఎన్టీఆర్‌తో ఆవిష్కరించేందుకు సిద్ధం చేసిన జెండా దిమ్మెను ట్రాక్టర్‌తో ఢీ కొట్టి పడగొట్టడంతోపాటు పక్కనే ఉన్న ఆస్పత్రి గోడను కూడా వెంకటరత్నం ట్రాక్టర్‌తో కూలగొట్టాడు. ఈ ఘటన గురించి అధికారులు ముందు రోజు రాత్రి ఎన్టీఆర్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తన బంధువే అయిన వెంకటరత్నం వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందారు. గ్రామంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా వెంకటరత్నం వ్యవహార శైలి ఆయనను కలచి వేయడంతో గ్రామానికి దూరమయ్యారు.
అయితే, అలాంటి వెంకటరత్నం ఇంటికి ఇప్పుడు బాలకృష్ణ వెళ్లారు. ఇది నందమూరి కుటుంబంలో చర్చకు, కలకలానికి దారి తీసింది. ఇటీవల రాజకీయాల్లోకి రావడంతోపాటు కృష్ణా జిల్లా రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్న బాలకృష్ణ.. వెంకటరత్నం ఇంట్లో అడుగు పెట్టారు. వెంకటరత్నం కుమారుడు శివరామకృష్ణ ఇంట్లో బస చేశారు. అంతేకాదు, నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్ఠించిన తన తాత ఎన్టీఆర్, నాయనమ్మ బసవ తారకం విగ్రహాల వైపు కూడా బాలకృష్ణ కన్నెత్తి చూడలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్ఠించిన కారణంగానే బాలకృష్ణ అటువైపు వెళ్లలేదన్న చర్చ జరుగుతోంది.
15 రోజుల కిందట కూడా మరోసారి ఆయన శివరామకృష్ణ ఇంట్లో బస చేశారు. ఇటీవల తన తల్లి స్వగ్రామమైన కొమరవోలు వచ్చిన బాలకృష్ణ అక్కడ తన మేనల్లుడి ఇంట్లో బస చేశారు. అక్కడి నుంచి నేరుగా నిమ్మకూరు వెళ్లారు. నందమూరి వంశస్తులు కోరడంతో తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసిన బాలకృష్ణ తిరిగి శివరామకృష్ణ ఇంటికి వెళ్లడం గ్రామంతోపాటు ఎన్టీఆర్ కుటుంబంలో కూడా చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిన, అప్పట్లో ఎన్టీఆర్‌ను వ్యతిరేకించిన వెంకటరత్నం ఇంటికి బాలకృష్ణ వెళ్లడం ఏమిటనేదే ప్రస్తుతం ఆ కుటుంబంలో చర్చ. ఎన్టీఆర్‌కు నిమ్మకూరులో సొంత ఇల్లు ఉన్నా బాలకృష్ణ ఆ ఇంటి వైపు కూడా వెళ్లలేదు. శివరామకృష్ణ ఇంటికి వెళ్లడంపై బాలకృష్ణ సోదరులకు కొంతమంది గ్రామస్తులు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ వ్యవహారం కృష్ణా జిల్లా టిడిపి నేతల వద్దకు వెళ్లింది. ఆ జిల్లా నాయకులు ఈ వ్యవహారాన్ని పార్టీ అగ్రనేతల దృష్టికి కూడా తీసుకెళ్లారు.
బాలకృష్ణ, హరికృష్ణ కుటుంబాల మధ్య పెరుగుతున్న అగాధానికి ఈ సంఘటనే ఉదాహరణ అని కొంతమంది టిడిపి నేతలు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారట. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంగా పెట్టడమే బాలకృష్ణ గేమ్‌ప్లాన్‌లో భాగమని కూడా మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications