అనుకున్నదొక్కటి: కిరణ్, బొత్సలకు షాకిచ్చారు

విభజనపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదని, పార్టీ నేతలకు నచ్చజెప్పండని, రాజీనామా చేసిన వారిని వాటిని ఉపసంహరింప చేసుకోనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం కిరణ్, బొత్సలు సీమాంధ్ర నేతలతో శనివారం భేటీ అయ్యారు. డెబ్బై నుండి ఎనబై మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే కిరణ్, బొత్సల సూచనలను సీమాంధ్ర నేతలు పక్కన పెట్టారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని హామీ వచ్చే వరకు తమకేదీ ముఖ్యం కాదని, రాజీనామాలు వెనక్కి తీసుకోమని, మిగతా వాళ్లం కూడా రాజీనామాకు సిద్ధమని చెప్పారట. అయితే కొందరు మాత్రం రాజీనామాలతో విభేదించినట్లుగా సమాచారం. రాజీనామాలకు బదులు తమ ప్రాంతానికి కావాల్సిన అంశాలపై డిమాండ్ చేయాలని సూచించారట. అయితే మెజార్టీ సభ్యులు మాత్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని, వెనక్కి తగ్గేది లేదని చెప్పారు.
అంతేకాదు తమ రాజీనామాలతో ఒరిగేదేమీ లేదని, మీరు కూడా రాజీనామాలు చేయాలని, అప్పుడు అధిష్టానం తప్పకుండా దిగి వస్తుందని కిరణ్, బొత్సలకు సూచించారట. అవసరమైతే తాము పదవులనే కాదు, పార్టీని వదిలేసేందుకు సిద్ధమని, రాష్ట్రపతి పాలన విధించి విభజించలేరని సీమాంధ్ర నేతలు స్పష్టం చేశారట. బుజ్జగింపుల కోసం భేటీ నిర్వహించిన కిరణ్, బొత్సలతో కూడా సమైక్యాంధ్ర కోసం చేసిన తీర్మానంలో సంతకం పెట్టించారు.
ఉద్యమానికి కిరణ్, బొత్సలు సారథ్యం వహించాలని నేతలు డిమాండ్ చేశారు. మీరు రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేశారు. హైదరాబాదు అందరికీ కావాలని, పార్టీ కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వారు సూటిగా కిరణ్, బొత్సలకు చెప్పారు. త్వరలో హైదరాబాదులో లక్ష మందితో బల ప్రదర్శన, మార్చ్ ఫాస్ట్‌కు కూడా నిర్ణయించారు. మొత్తానికి అధిష్టానం పెద్దల సూచనలతో సముదాయింపు యత్నాలు విఫలమయ్యాయి. ఈ సమావేశంలో ఏఐసిసి పరిశీలకులు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications