వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సేఫ్: చిరు, బాలయ్య ఆంధ్రలో పోటీ చేయలేరా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Seats of Andhra leaders in danger
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే కొత్త సీమాంధ్ర రాష్ట్రంలో కేంద్ర మంత్రి చిరంజీవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీ చేయలేరా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తాకథనం ప్రకారం వారిద్దరు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయలేరనే అభిప్రాయం కలుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభలో అడుగు పెట్టాలని ఉవ్వళ్లూరుతున్న నందమూరి హీరో బాలకృష్ణకు కూడా అదే పరిస్థితి ఎదరువుతోందని అంటున్నారు. ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

రాజ్యాంగ నిబంధనల మేరకు ఓ రాష్ట్రంలో పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలోనే ఓటు హక్కును కలిగి ఉండాలి. చంద్రబాబు నాయుడితో పాటు పలువురు రాజకీయ నాయకులు చాలా కాలంగా హైదరాబాదులో ఓటర్లుగా నమోదై ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అగ్రనేతలు వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ మాత్రం తమ తమ నియోజకవర్గాల్లోనే ఓటర్లుగా నమోదై ఉన్నారు. దీంతో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారి వారి నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ విధమైన ఆటంకాలు ఉండవు.

హైదరాబాద్ నగరంలో ఓటు హక్కు కలిగి ఉన్న సీమాంధ్ర నాయకులు తమ సొంత రాష్ట్రంలో ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకుని పోటీ చేయడానికి వీలు కలుగుతుందా అనేది ప్రశ్న. ఆ నాయకులు తమ ఓట్లను బదిలీ చేసుకోవడానికి వీలుంటుందని, హైదరాబాదులో ఓటర్లుగా ఉన్నప్పటికీ తమ తమ సొంత నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

పైగా, పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటోంది. దీంతో హైదరాబాదులో ఓటర్లుగా ఉన్న నాయకులు తమ తమ సొంత నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి వీలు ఉంటుందని కేంద్ర ఎన్నికల కమిషనర్ కెజె రావు చెప్పినట్లు దక్కన్ క్రానికల్ దినపత్రిక రాసింది.

పలువురు సీమాంధ్ర నాయకులు హైదరాబాదులో ఆస్తులు సమకూర్చుకుని ఇక్కడే తమ స్థిరనివాసాలను ఏర్పరుచుకున్నారు. చంద్రబాబు నాయుడు, చిరంజీవి, బాలకృష్ణలతో పాటు దాసరి నారాయణరావు, మురళీమోహన్, తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య తదితరులు హైదరాబాదు‌లో స్థిరపడ్డారు. పదేళ్ల తర్వాత సీమాంధ్ర నాయకులు తమ ఓట్లను సీమాంధ్రకు మార్చుకోవచ్చునని, అయితే, హైదరాబాదులో హాయిగా ఉండవచ్చునని, కానీ తెలంగాణ పౌరులుగా ఉండబోరని తెలంగాణ నాయకులు అంటున్నట్లు ఆ పత్రిక రాసింది.

English summary
According to media reports - A debate currently going on in political circles is that after the state’s division, would top Seemandhra leaders like TD chief N. Chandrababu Naidu, Union minister K. Chiranjeevi, TD leader and actor Balakrishna and others be eligible to contest in their own Seemandhra state?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X