వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇస్తే.. ఇవ్వొద్దు': దేశభద్రతకు తెలంగాణ లింక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana will create pan india chaos, says gove: DNA report
తెలంగాణ అంశం సున్నితమైనదని, కష్టమైనదని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడుతున్నట్లుగా డిఎన్ఏ ఓ కథనం ప్రచురించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే దేశవ్యాప్తంగా వేర్పాటువాద ఉద్యమాలు విజృంభిస్తాయంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ సంఘానికి కేంద్ర హోంశాఖ వారం క్రితం ఒక నివేదికను సమర్పించినట్లుగా పేర్కొంది. హోంశాఖలోని ఉన్నతస్థాయి అధికారులు ఈ నివేదికను రూపొందించినట్లుగా తెలిపింది.

తెలంగాణ డిమాండును ఆమోదించడం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో, డార్జిలింగులోని గూర్ఖాల్యాండు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చే అవకాశముందని ఈ నివేదిక అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ప్రాంతాలు చైనా, నేపాల్, మయన్మార్‍‌లతో సరిహద్దులు కలిగి ఉండటం వల్ల సమస్యలు ఎదురు కావొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల బోడోల్యాండు, కూచ్‌బీహార్, హరితప్రదేశ్, బుందేల్ ఖండ్, పూర్వాంచల్, విదర్భ వంటి ప్రాంతాల్లో ఉద్యమాలు తలెత్తవచ్చుననే అనుమానాలు నివేదిక వ్యక్తం చేసింది.

వీటన్నింటిని ఎదుర్కోవడం కంటే ఒక ప్రాంతంలో ఉద్యమాన్ని ఎదుర్కోవడమే మంచిదని నివేదికలో సూచించిదట. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవద్దని హోంశాఖ కేంద్ర ప్రభుత్వానికి సూచించిందట. దేశ భద్రత కోణంలో చూస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును పరిశీలనలోకి తీసుకోరాదని స్పష్టం చేసిందట. ప్రాంతీయంగా ఒకచోటే ఉద్యమం కొనసాగేలా చూసుకోవడమా!? లేక, దేశ భద్రతపరంగా అత్యంత సున్నిత ప్రాంతాలు సహా వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాలు వ్యాప్తి చెందేలా చేయడమా!? అనే రెండు మార్గాలు మన ముందున్నాయని నివేదికలో ఉందని సమాచారం.

ప్రాంతీయంగా ఒకేచోటే ఉద్యమాన్ని పరిమితం చేయడమే తెలివైన నిర్ణయమని పేర్కొందట. అసోంలోని బోడోలాండ్, పశ్చిమ బెంగాల్లోని కూచ్ బీహార్, గూర్ఖాల్యాండ్ ఉద్యమ నేతలు తెలంగాణ ఉద్యమాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారని, మళ్లీ ఆందోళనకు శ్రీకారం చుట్టేందుకు తెలంగాణ ప్రకటన వచ్చే వరకూ వేచి ఉండాలని నిర్ణయించుకున్నారని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు వివరించింది.

English summary
Telangana will create pan india chaos, says gove: DNA report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X