అటాక్: తెలుగులో మాట్లాడి నేతను కాపాడిన డ్రైవర్

V C Shukla
నాలుగు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మారణకాండలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా తీవ్ర గాయాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. సల్వాజుడుం వ్యవస్థాపకులు మహేంద్ర కర్మ, పిసిసి చీఫ్ నందకుమార్ తదితరులను మట్టుబెట్టిన మావోయిస్టులు ఇతర పలువురు నేతలను కూడా బలి తీసుకున్నారు. విసి శుక్లాను ఆయన డ్రైవర్ తన చాకచక్యంతో కాపాడారు.

ఈ విషయాన్ని డ్రైవరే స్వయంగా ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... పరివర్తన్ యాత్ర ముగించుకొని కాంగ్రెసు నేతలు మహేంద్ర కర్మ, నంద కుమార్, విసి శుక్లా తదితరుల కాన్వాయ్‌లు వస్తున్నాయి. విసి శుక్లా వాహనాన్ని కూడా మావోయిస్టులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. వాహనాలను పరిశీలిస్తూ ప్రతి ఒక్కరిని పేరుపేరునా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సమయంలో మావోయిస్టులు తెలుగులో మాట్లాడారు. ఇది గమనించిన శుక్లా కారు డ్రైవర్ తన సీటు నుంచి ఒక్కసారిగా బయటకు దిగి.. తమపై కాల్పులు జరపవద్దని, తనకు హిందీ రాదని, తెలుగు ఒక్కటే తెలుసునని, తన సేఠ్‌తో పాటు మరికొందమంది తమ వాళ్లు లోపల ఉన్నారని, తామంతా ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి వస్తున్నామని బిగ్గరగా కేకలు వేశాడు. అనుకోని పరిస్థితుల్లో కాన్వాయ్‌లో చిక్కుకున్నామన్నాడు.

ఆయన మాటలు విన్న మావోయిస్టులు విసి శుక్లా కారును వదిలేశారట. డ్రైవర్ తెలుగులో బిగ్గరగా అరిచి చెప్పడంతో అతనిపై వారికి ఏమాత్రం అనుమానం కలుగలేదు. దీంతో మావోయిస్టులు మరెప్పుడూ ఈ మార్గంలో రావద్దని హెచ్చరించి ఆ కారును వదిలి పెట్టారు. అయితే వారి వద్ద నున్న మొబైల్ ఫోన్‌లను లాక్కున్నారు. అయితే, అంతకుముందే కాల్పులు జరపడంతో శుక్లా తీవ్రంగా గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+