పివి కూతురికి చాన్స్: చిరంజీవి నెగ్గుతారా?

Chiranjeevi
హైదరాబాద్‌: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీటును తన వర్గానికి చెందిన నాయకుడికి ఇప్పించుకోవడంలో కేంద్ర మంత్రి చిరంజీవి విజయం సాధిస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈనెల 6న ఢిల్లీలో జరగనున్న హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు, ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరుకానున్న ముఖ్య మంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి గవర్నర్‌ కోటా నామినేటెడ్‌ ఎమ్మెల్సీల జాబితాపై అధిష్ఠానంతో చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే కంతేటి సత్యనారాయణరాజు, పివి నరసింహారావు కూతురు వాణి, వ్యవసాయ నిపుణుడు అల్దాస్‌ జానయ్య పేర్లు ఖరారైనట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన ఆ ఒక్క స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది. పిసిసి కార్యదర్శి ఎస్పీ తివారి, భమిడిపాటి రామ్మూర్తి, పివి రంగారావు, ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు కూతురు శ్రీనగి, ధీరావత్‌ భారతీనాయక్‌, వరంగల్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బండి సుధాకర్‌గౌడ్‌ తదితరులు ప్రయత్ని స్తున్నారు.

కేంద్రమంత్రి పదవి ఎలాగూ ఇవ్వనందున, కనీసం తన కూతురుకు ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కావూరి ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. ఇటీవల శ్రీనగి పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో రాహుల్‌ను కూడా కలసి, ఎమ్మెల్సీ సీటు అభ్యర్ధించినట్లు ప్రచారం జరిగింది. అయితే, కావూరి కుటుంబానికి రానున్న ఎన్నికల్లో జగన్‌ పార్టీ నుంచి ఎంపీ సీటు దాదాపు ఖరారయిందని, అది ఆమె కూతురుకే దక్కుతుందన్న ప్రచారం తీవ్రస్థాయిలో జరిగిన విషయం తెలిసిందే.

కాగా గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని తన వర్గానికి ఇప్పించుకునేందుకు కేంద్రమంత్రి చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఐపీఎస్‌ అధికారి డిటి నాయక్‌కు సీటు ఇప్పించేందుకు ఒత్తిడి చేస్తున్నారు. ఆయనకు గతంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇప్పించేందుకు చిరు ప్రయత్నించి విఫలమయ్యారంటున్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావుకూ సీటు ఇప్పించేందుకు చిరు చేసిన ప్రయ త్నాలు విఫలమయ్యాయి.

డిటి నాయక్‌ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం ఇటీవల జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. డిటి నాయక్‌కు ఎమ్మెల్సీ సీటు ఇప్పించుకోవడంలో చిరంజీవి విజయం సాధిస్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+