అమీర్ ఖాన్ భార్య: టీ లింక్, ఎవరీ కిరణ్ రావు?
ముంబై: అసహనంపై మాట్లాడుతూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ దేశం విడిచి వెళ్దామని తన భార్య కిరణ్ రావు అంటోందని అన్నారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ఆయన భార్య కిరణ్ రావుపై కూడా అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆయన భార్య కిరణ్ రావు ఎవరనే ప్రశ్న ముందుకు వచ్చింది.
కిరణ్ రావుకు తెలంగాణకు విడిదీయరాని సంబంధమే ఉంది. కిరణ్ తండ్రి వైపు తాత మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి రాజవంశీకుడు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన కిరణ్ తండ్రి ఉద్యోగరీత్యా బెంగళూరు, కోల్‌కతా, ముంబైల్లో పనిచేశారు. దీంతో కిరణ్ విద్యాభ్యాసం కూడా కోల్‌కతా, ముంబైలలో సాగింది.
కోల్‌కతాలోని లొరెటో హౌస్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన కిరణ్ ఎకనమిక్స్ డిగ్రీని ముంబైలోని సోఫియా కళాశాల నుంచి పొందారు. ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ నుంచి పొందారు. సినీరంగంపై ఉన్న ఆసక్తితో అశుతోష్ గోవర్కిర్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరిన కిరణ్ ఆమీర్‌ఖాన్ నిర్మించిన లగాన్‌కు పనిచేశారు.

ఆ సమయంలో ఆమీర్‌తో ఏర్పడిన పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. 2002లో ఆమీర్ తన తొలి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే బాబు ఉన్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు అబుల్ కలాం ఆజాద్ పేరు మీదుగా తన కొడుకుకు ఆజాద్ అని పేరు పెట్టినట్లు కిరణ్ గతంలో ప్రకటించారు.
లగాన్ తర్వాత గోవర్కిర్ వద్ద స్వదేశ్ సినిమాకూ కిరణ్ అసిస్టెంట్‌గా చేశారు. అనంతరం మీరానాయర్ వద్ద మాన్‌సూన్ వెడ్డింగ్ అనే సినిమాకు అసిస్టెంట్‌గా చేశారు. 2011లో సొంతంగా ఆమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ధోబీ ఘాట్ అనే సినిమాను స్వీయదర్శకత్వంలో నిర్మించారు.
తారే జమీన్ పర్, జానే తు.. యా జానేనా, తలాష్, పీప్‌లీ లైవ్, ఢిల్లీ బెల్లీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆమీర్ నటించిన దిల్ చాహతా హై చిత్రంలో చిన్న పాత్రలో కిరణ్‌రావు కనిపిస్తారు. కిరణ్‌రావు 1973 నవంబరులో బెంగళూరులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రావు, ఉమ ప్రస్తుతం బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications