కిరణ్ రెడ్డి పార్టీకి అశోక్ బాబు వికెట్ కీపర్?

పలు విడతలుగా జరిగిన సర్వేలు కూడా ఉద్యోగుల పాత్రను ఆషామాషీగా తీసుకోకూడదనే తేల్చిచెప్పడంతో ఆ దిశగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోటరీ పావులు కదిపినట్టు సమాచారం. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీల తరహాలో పి.అశోక్‌బాబు స్వరం పెంచి మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుందని అంటున్నారు. కొత్త పార్టీతో అనుబంధం పెంచుకున్న అశోక్‌బాబు కార్యకలాపాలు రాజకీయ పార్టీల తరహాలోనే వుండటం, ఉద్యమ కార్యాచరణ కూడా అందుకు అనుగుణంగానే వుండటం గమనార్హం.
సమైక్యాంధ్ర పార్టీని ఇటీవల రిజిస్ట్రేషన్ చేయించిన కుమార్ చౌదరితో అశోక్‌బాబు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఆ పార్టీని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోకి తీసుకొచ్చేందుకు అశోక్‌బాబు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోందంటూ ఆ పత్రిక వ్యాఖ్యానించింది. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటినుంచి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, అశోక్‌బాబు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్న విషయం కాదలేని వాస్తవం. ఈ నేపథ్యంలో కొత్త పార్టీలో అశోక్‌బాబుది కీలకపాత్ర కానున్నదని, ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చిందని అంటున్నారు.
ఎఐసిసి సమావేశానికి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డి ఉండడంలోని ఆంతర్యం కొత్త పార్టీ పెట్టడానికి పూనుకోవడమే కారణమని అంటున్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో సమైక్యాంధ్ర ఆవశ్యతను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేసి తద్వారా సీమాంధ్రలోని జనం మెప్పుపొందే దిశగా యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న సమైక్యాంధ్ర పార్టీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోకి తీసుకొస్తే పార్టీని స్థాపించిన కుమార్ చౌదరికి మున్ముందు పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చేందుకు ఆయనతో చర్చల్లో అశోక్‌బాబు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ కొత్త పార్టీని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే పనిలో అశోక్‌బాబు కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications