నంద్యాలపై నజర్ ఎవరిది?: పందాలపై పందాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవితవ్యాన్ని మార్చేస్తుందన్న సంకేతాల మధ్య నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక పలువురికి కాసుల పంట పండిస్తున్నది.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవితవ్యాన్ని మార్చేస్తుందన్న సంకేతాల మధ్య నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక పలువురికి కాసుల పంట పండిస్తున్నది. అగ్రనేతల ప్రచారాలు... పోటాపోటీగా విమర్శలు... ఇరు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకమైన పోరు! కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపై అందరిలోనూ ఆసక్తి! రాజకీయ విశ్లేషకులు, సామాన్యులు మాత్రమే కాదు... 'నంద్యాల'పై పందెం రాయుళ్ల కన్ను కూడా పడింది.

అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? పరిస్థితి ఎటువైపు మళ్లుతుంది? ఏ వర్గం ఓట్లు ఎటు? సీఎం చంద్రబాబు వరాలు, ప్రతిపక్ష నేత జగన్‌ వ్యాఖ్యలు ఎంతమేరకు ప్రభావం చూపిస్తాయి? గత ఎన్నికల లెక్కలేంటి? కొత్త రాజకీయ సమీకరణాలేంటి?..ఇలా తామే ఓ ప్రశ్నావళి రూపొందించుకుని, వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తూ బెట్టింగులకు సిద్ధమవుతున్నారు.

రాజకీయ నేతలు, ప్రచారంలో ఉన్నవారు, నంద్యాలలో ఉండే స్నేహితులు, బంధువులు, మీడియాలో తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి గెలుపోటములపై అంచనాలకు వస్తున్నారు. ప్రచారంలో చిన్న స్థాయి నాయకులతోపాటు గన్‌మెన్లు, కారు డ్రైవర్ల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు.

హైదరాబాద్ కు పాకిన బెట్టింగ్

హైదరాబాద్ కు పాకిన బెట్టింగ్

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలుపోటములపై బెట్టింగ్‌లు రూ. వెయ్యి కోట్లు దాటినట్టు తెలుస్తున్నది. పందెం అంటే గుర్తుకు వచ్చే కర్నూల్, అనంతపురం జిల్లాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలోనూ బెట్టింగ్ జోరు సాగుతున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీల అధినేతలు చంద్రబాబు, వైఎస్ జగన్ నంద్యాల ఎన్నికపైనే కన్నేశారు. ఇక రెండు ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న హోరాహోరీ పోరు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తుండటం గమనార్హం. నంద్యాల సెగ్మెంట్‌లోని 2.18 లక్షల మంది ఓటర్లకు కాసుల వర్షం కురుస్తున్నది. రెండు పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు కుమ్మరిస్తున్నాయి. మా పార్టీ మీటింగ్‌కు రావాలని ఒకరు, వేరే పార్టీ మీటింగ్‌కు వెళ్లవద్దని ఇంకొక పార్టీ వాళ్లు పోటీలు పడి డబ్బులు పంచుతున్నారు. ప్రస్తుతం రోజుకు రూ.5 కోట్ల మేరకు ఇద్దరు అభ్యర్థులు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

Recommended Video

    Nandyal By Polls : Pawan Kalyan won't support any party, takes neutral stand | Oneindia Telugu
    బాలక్రుష్ణ ఇలా రోడ్ షో

    బాలక్రుష్ణ ఇలా రోడ్ షో

    నంద్యాల బెట్టింగ్ సరిహద్దులు దాటింది. ఇటు కర్నూల్, అటు బెంగళూర్ అడ్డాగా చేసుకొని బెట్టింగ్‌లు సాగుతున్నాయి. అధికార టీడీపీ నుంచి బ్రహ్మానందారెడ్డి, ప్రతిపక్ష వైసీపీ నుంచి శిల్పా మోహన్‌రెడ్డి పోరులో నిలిచారు. ఇంకా కాంగ్రెస్, రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా నంద్యాలలోని ఆయా ప్రాంతాల్లో హిందూపూర్ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ, నంద్యాల, చింత అరుగులో వైసీపీ అధినేత జగన్ బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ నెల 23న పోలింగ్ జరుగనుండగా ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్ల బెట్టింగ్ పెట్టినట్టు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. ఇంత భారీ స్థాయిలో బెట్టింగ్ సాగడం ఇది రెండోసారిగా చెబుతున్నారు. గతంలో కడప పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సాగిన బెట్టింగ్‌ల కంటే ఈసారి ఎక్కువని తెలుస్తున్నది.

    అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ

    అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ

    విషయం ఏదైనా పందేనికి సై అనే భీమవరంతోపాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రకాశం జిల్లా అద్దంకి, గుంటూరు, కడప తదితర చోట్ల నంద్యాల బరిపై పందేల జోరు మొదలైంది. అంతేకాదు... హైదరాబాద్‌లోనూ పందెం కడుతున్నారు. ఈ బెట్టింగ్‌ల వ్యవహారం ప్రవాసాంధ్రులకూ పాకినట్లు సమాచారం. వారు కూడా రాష్ట్రంలో ఉన్న తమ పరిచయస్తులకు ఫోన్లు చేసి... ‘నంద్యాల ఎన్నికలపై ఫలానా పందెం ఉంది? వేయొచ్చా?' అని అడుగుతున్నారు. బెట్టింగ్‌ వీరులు రాజకీయ పార్టీలకంటే ఎక్కువగా విశ్లేషణ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా నంద్యాలలో ‘స్వీయ పరిశీలన' కూడా జరిపిస్తున్నారు. వీలైతే తామే వెళ్లడం, లేదా తమకు తెలిసిన వారిని పంపి రెండు మూడురోజులు అక్కడే మకాం వేసి, సొంతంగా సర్వే చేయిస్తున్నారు. ప్రస్తుతానికి ఏ పార్టీ గెలుస్తుంది? అన్నదానిపైనే ఎక్కువ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఉప ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి మెజారిటీమీద కూడా పందేలు జోరందుకోనున్నాయి.

    అధినేతలకే సవాల్ నంద్యాల ఉప ఎన్నిక

    అధినేతలకే సవాల్ నంద్యాల ఉప ఎన్నిక

    నంద్యాల ఉపపోరు రణరంగంలో కోట్లు పారుతున్నాయి. ఒక్కో అభ్యర్థి రోజుకు రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ ఓటుకు రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ ఉప ఎన్నికలకు ఒక్కో పార్టీ అభ్యర్థి రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు లెక్కలేస్తున్నారు. ఇక తమ రాజకీయ భవితవ్యానికి గీటురాయిగా భావిస్తుండటంతో ఎపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రతిపక్ష నేత - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైఎస్ జగన్ నంద్యాలలోనే తిష్ఠ వేయగా, చంద్రబాబు తరుచుగా నంద్యాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+