వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు షాక్: 2019లో ఏపీలో బిజెపి ఒంటరిపోరు, ముగ్గురికి కీలక బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వంతంగా బలపడేందుకు బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది.2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసేందుకు అనువైన వ్యూహన్ని బిజెపి జాతీయ నాయకత్వం అమలు చేసోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వంతంగా బలపడేందుకు బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది.2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసేందుకు అనువైన వ్యూహన్ని బిజెపి జాతీయ నాయకత్వం అమలు చేసోంది. ఈ మేరకు ముగ్గురు కీలక నేతలకు బిజెపి జాతీయ నాయకత్వం బాధ్యతలను అప్పగించింది.ఉత్తరాంధ్ర బాధ్యతలను బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావుకు, కోస్తాంధ్ర బాధ్యతలను కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్‌కు, రాయలసీమ బాధ్యతలను మహరాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్‌డే‌కు అప్పగించారు. 2019 ఎన్నికల్లో టిడిపిని శాసించే స్థితిలో సీట్లను గెలుచుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది.

దక్షిణాదిలో స్వతహగా బలం పెంచుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలపై బిజెపి గురిపెట్టింది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీచేయాలని ఆ పార్టీ వ్యూహన్ని రచిస్తోంది.

Recommended Video

రిలయన్స్‌కు బాధ్యతలు..పేదోళ్లకు దెబ్బే? హెరిటేజ్ ను ఫ్యూచర్ గ్రూపుకు కట్టబెట్టింది అందుకేనా|Oneindia

2019 ఎన్నికల్లో స్వంతంగా సుమారు 350 ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగానే బిజెపి నాయకత్వం దక్షిణాది రాష్ట్రాల్లో తమ బలం లేని రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకొనేందుకు అవసరమైన వ్యూహలను అనుసరిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో స్వతహగా బలాన్ని పెంచుకోకపోతే ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. దరిమిలా బిజెపి నాయకత్వం 2019 ఎన్నికలకు వ్యూహత్మకంగా అడుగులను వేస్తోంది.

ఏపీలో ఒంటరి పోరుకు బిజెపి

ఏపీలో ఒంటరి పోరుకు బిజెపి

దక్షిణాదిలోని ఏపీ రాష్ట్రంలో బిజెపి స్వంతంగా బలపడేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. 2019 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీచేయాలని ప్లాన్ చేస్తోందని బిజెపి వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే 25 ఎంపీ స్థానాలపై బిజెపి కేంద్రీకరించింది.ఈ ఎంపీ స్థానాలపై బిజెపి కేంద్రీకరించి పనిచేస్తోంది. ఉత్తరాంధ్ర బాధ్యతలను బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావుకు, కోస్తాంధ్ర బాధ్యతలను కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్‌కు, రాయలసీమ బాధ్యతలను మహరాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్‌డే‌కు అప్పగించారు. ఆయా ప్రాంతాల్లోని ఎంపీ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను ఈ ముగ్గురు నేతలు పర్యవేక్షించనున్నారు.

బూత్‌స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బిజెపి

బూత్‌స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బిజెపి

నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. తెలంగాణకు చెందిన మురళీధర్‌రావు ఎబివిపి నుండి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. గత ఎన్నికల్లో రాజస్థాన్‌లో పనిచేసి బీజేపీ మంచి ఫలితాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల నాడిని పట్టి పార్టీని అక్కడ బలోపేతం చేస్తారని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోంది.ఇక మహారాష్ట్ర విద్యా మంత్రి వినోద్‌ తావ్‌డేకు రాయలసీమ బాధ్యతలు అప్పగించారు. అక్కడున్న మొత్తం ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో పర్యటించి బూత్‌స్థాయిలో పార్టీని పటిష్టం చేయనున్నారు.కోస్తా బాధ్యతలను కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌కు అప్పగించారు. రాష్ట్రంలో ఇది కీలక ప్రాంతం కావడంతో కేంద్ర మంత్రిని ఎంపికచేసినట్లు సమాచారం.

అక్లోబర్‌లో ఏపీకి అమిత్‌షా

అక్లోబర్‌లో ఏపీకి అమిత్‌షా

గత నెలలో ఏపీ రాష్ట్రంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో అమిత్‌షా తన పర్యటనను వాయిదావేసుకొన్నారు. అక్లోబర్ మాసంలో ఏపీ రాష్ట్రంలో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందింది. 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ పర్యటనలో పార్టీ శ్రేణులకు బిజెపి జాతీయ అధ్యక్షుడు దిశానిర్ధేశం చేయనున్నారు.

పొత్తులపై ఆచితూచి నిర్ణయం

పొత్తులపై ఆచితూచి నిర్ణయం

2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో పొత్తులపై ఆచితూచి వ్యవహరించాలని బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల వరకు బిజెపిలో ఎక్కువ మంది నాయకులు టిడిపితో పొత్తును వ్యతిరేకించారు. కానీ, నంద్యాల ఎన్నికల ఫలితాల్లో అనుహ్యంగా వచ్చిన మెజారిటీతో బిజెపిలో బాబు వ్యతిరేకులు మాత్రం కాస్త వెనక్కు తగ్గారు. 2019 ఎన్నికలవరకు బిజెపి...టిడిపిల మధ్య పొత్తు ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇప్పటికే ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు జాతీయ రాజకీయ అవసరాలకు అనుగుణంగా పొత్తుపై బిజెపి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే బిజెపితో కలిసి పోటీచేయాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది.

English summary
Bjp is planning to contest all the 25 Lok Sabha seats in Andhra Pradesh, confining the alliance with the Telugu Desam Party to just assembly elections. BJP wants to shift the focus on South India this time and win the maximum number of MP seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X