చెదరని స్నేహం: బాబుకు బీజేపీ కేంద్రమంత్రి ఆఫర్!
విజయవాడ: ఏపీలో టిడిపి - బిజెపి మిత్రుత్వం కొనసాగనుంది. ఏపీలో ఎప్పుడైనా ఈ రెండు పార్టీలు దూరం కావొచ్చనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కానీ రాజకీయ పరిణామాలు చూస్తుంటే వారి మధ్య బంధం 2019 వరకు ఉండేలా కనిపిస్తోంది.
అంతేకాదు, కేంద్రమంత్రి సురేష్ ప్రభును ఏపీ నుంచి చంద్రబాబు రాజ్యసభకు పంపించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఓ మంత్రి పదవి, కొన్ని నామినేటెడ్ పోస్టులు టిడిపికి ఇచ్చేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మరో అంశం కూడా ఉంది.
టిడిపి ఎప్పటి నుంచో తమకు ఓ గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీని అడుగుతోంది. తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులకు చంద్రబాబు ఎప్పుడో హామీ ఇచ్చారు. దాని కోసం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గవర్నర్ పదవి, కేంద్రమంత్రి పదవులలో ఏదో ఒకటి మాత్రమే ఇస్తామని బీజేపీ చెప్పిందని తెలుస్తోంది.

సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపించడం ద్వారా బీజేపీ అధిష్టానం నుంచి చంద్రబాబు మార్కులు కొట్టేశారు. అందుకు అనుగుణంగా పార్టీ కోసం ఎన్నాళ్లుగానే పని చేస్తున్న వారికి రాజకీయ ప్రయోజనాలు కల్పించే దిశలో అడుగులు వేస్తున్నారు.
రాజకీయాల్లో ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం ఉండాలన్న సూత్రానికి అనుగుణంగానే రాజ్యసభ సీటు ఇచ్చిన టిడిపికి కేంద్రంలో అదనంగా ఒక సహాయమంత్రి పదవి ఇచ్చేందుకు బిజెపి నాయకత్వం అంగీకరించిందని అంటున్నారు.
బిజెపికి ఒక రాజ్యసభ సీటు ఇచ్చినందుకు గాను.. గవర్నర్‌తోపాటు కొన్ని కేంద్ర నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, బాబు బిజెపిముందు ప్రతిపాదన పెట్టారని తెలుస్తోంది. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సూచనల మేరకు.. టిటిడిలో బిజెపికి చెందిన ఇద్దరికి స్థానం కల్పించారు. తెలుగుదేశం పార్టీలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశమిచ్చారు.
ఇదిలా ఉండగా, తాము అడిగింది ఇస్తున్న చంద్రబాబుకు.. గవర్నర్ పదవి లేదా ఓ కేంద్ర సహాయమంత్రి పదవి, మరో రెండు కేంద్ర నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిందని తెలుస్తోంది. చంద్రబాబు గవర్నర్ పదవి, కేంద్ర సహాయమంత్రి పదవి కోరగా... రెండింటిలో ఒకదానికే బీజేపీ ఒకే చెప్పిందని తెలుస్తోంది.
మరోవైపు, కేంద్రంలో అదనంగా ఒక సహాయ మంత్రి పదవి ఖాయమని తెలిసిన నేపథ్యంలో.. టిడిపి ఎంపిలు లాబీయింగ్ ప్రారంభించారని తెలుస్తోంది. ఈ విషయంలో అనూహ్యంగా తెరపైకొచ్చి రాజ్యసభ సీటు పొందిన టిజి వెంకటేష్ అప్పుడే తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఆయన ఇప్పటికే ఈ విషయంలో నారా లోకేష్‌ను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సీటు సాధించేందుకు మార్గాలేమిటో తెలిసిన టీజీ వెంకటేష్.. ఇప్పుడు కేంద్రమంత్రి పదవి సాధనలోనూ అదే మార్గం అనుసరించే పనిలో ఉన్నారంటున్నారు.
తద్వారా లోకేష్ చక్రం తిప్పుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని అంటున్నారు. టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ రావడం వెనుక కూడా లోకేష్ ఉన్నాడని చెబుతున్నారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడంపై కెఈ ప్రభాకర్ సహా ఇతర వర్గాలు బహిరంగంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
కాపు ఉద్యమ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన ఎంపి, ప్రస్తుతం లోకసభలో పార్టీ నేతగా ఉన్న తోట నరసింహంపేరు కూడా వినిపిస్తోంది. తోటకు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాపులను తమవైపుకు తిప్పుకోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, తెలంగాణలో పార్టీ దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఒక్క రేవంత్ రెడ్డి మినహా మరెవరూ ప్రభుత్వంపై అంతగా పోరాడినట్లు కనిపించడం లేదు. అయితే రేవంత్ రెడ్డి ప్రసంగాల వరకూ బాగున్నప్పటికీ, సంస్థాగతంగా, కార్యకర్తల్లో నైతిక స్థైర్యం వచ్చేలా నిర్ణయాలు తీసుకోవలసి ఉందంటున్నారు.
అందులో భాగంగా.. చంద్రబాబుకు విధేయుడైన వరంగల్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావుకు కేంద్రమంత్రి పదవి ఇవ్వవచ్చునని అంటున్నారు.
తెలంగాణలో పార్టీకి శస్తచ్రికిత్స చేయాలంటే అక్కడి నుంచి ఒకరికి కేంద్రమంత్రి పదవి ఇస్తే మళ్లీ కార్యకర్తల్లో కదలిక, ఉత్సాహం వస్తుందంటున్నారు. అయితే, తమ కోటాలో వచ్చిన కేంద్రమంత్రి పదవిని తెలంగాణ నేతలకు ఇస్తే ఏపీలో చంద్రబాబు చిక్కులు ఎదుర్కోవల్సి ఉంటుందని చెప్పవచ్చు. విపక్షాలు పదేపదే దీనిని ప్రశ్నిస్తాయి.
-
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
విజయ్ చుట్టూ వల- నయానో, భయానో -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం












Click it and Unblock the Notifications